'Give up tobacco and get two glasses milk daily' సిగరెట్, గుట్క మానితే అరలీటర్ పాలు ఫ్రీ..

Give up tobacco and get two glasses milk daily

Anti-tobacco, Kaushambi jail, Gandhi Jayanti, De-addiction, Firozabad jail, Lung-related diseases, Uttat Pradesh, superintendent BS Mukund, anti tobacco measures, latest news

‘Give up tobacco and get two glasses full of milk daily’ is the new mantra adopted by Kaushambi jail superintendent to motivate the prisoners to give up the habit.

భలే ఆఫర్: సిగరెట్, గుట్కా మానేస్తే పాలు ఫ్రీ

Posted: 10/04/2017 12:33 PM IST
Give up tobacco and get two glasses milk daily

పోగరాయుళ్లును ఎంతగా బతిమాలినా పోగను మాత్రం వీడరు. అదో వ్యవసంగా మారిందని, దానిన వదలడం కష్టమని కూడా కబుర్లు చెబుతారు. అయితే ఇలాంటి వారి చేత కూడా బీడి, సిగరెట్, గుట్కా, తంబాకు మాన్పించేందకు సంకల్పించిన ఓ జైలు సూపరింటెండెంట్ భలే అఫర్ ను తన జైలులోని ఖైదీల ఎదుట పెట్టాడు. బీడీ, సిగరెట్, తంబాకు, గుట్కా తదితర పోగ ఉత్సత్తులను వినియోగించడం వల్ల భవిష్యత్తులో వచ్చే రోగాలను వారికి చెప్పి.. దానికి అరోగ్యంతో ముడిపెట్టి.. చెక్ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని కౌషాంబీ జైలు సూపరింటెండెంట్ బీఎస్ ముకుంద్.. తమ జైలులో వున్న 642 ఖైదీలలో సుమారు 70శాతం మంది ఖైదీలకు పోగాకు అలవాటు వుందని గ్రహించాడు. దీంతో వారిని ఈ అలావాటుకు దూరంగా వుంచాలని ఎవరైతే పోగాకు ఉత్పత్తులకు మానేస్తారో.. వారికి ఉదయం ఒక గ్లాసు, రాత్రి ఓ గ్లాసు పాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పోగాకు సేవించి రోగాల బారిన పడటం కంటే పాలు తాగి అరోగ్యంగా వుండాలని ఈ అఫర్ ఫ్రకటించినట్లు ఆయన తెలిపారు.

తానిచ్చిన ఆఫర్ సత్ఫలితాలు ఇవ్వడం మొదలైందని కూడా చెప్పారు. ఇప్పటికే కొంతమంది ఖైదీలు ధూమపానానికి స్వస్థి చెప్పారని కూడా తెలిపారు. కౌషాంబీ జైలు సూపరింటెండెంట్ ప్రకటించిన ఉచిత పాల ఆఫర్ తో సుమారు ఐదు శాతం మేర దూమపానానికి దూరమయ్యారని, వీరిని చూసి మరికోందరు కూడా త్వరలోనే దూరమవుతారని అంటున్నారు ముకుంద్. దీంతో పొగతాగని ఖైదీల కోసం జైలులో ప్రత్యేకంగా ఓ బ్యారక్ ను సైతం ఏర్పాటు చేశామని ముకుంద్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Senior actress raja sulochana dead
Nandamuri balakrishna joins chandra babu padayatra  

Other Articles