SBI, BoB and Andhra Bank lowers base rate ఎస్బీఐ కూడా పండగ శుభవార్తను చెప్పేసిందిలా..

After bob and andhra bank state bank of india cuts base rate

State Bank of India, Business, Interest Rates, Bank of Baroda, SBI, Reserve Bank of India, Banking,Monetary Policy, repo rate

This comes after a couple of other public sector banks including Bank of Baroda and Andhra Bank earlier in the day announced a reduction in their base rates. RBI will announce key policy rate on October 4.

ఎస్బీఐ కూడా పండగ శుభవార్తను చెప్పేసిందిలా..

Posted: 09/29/2017 02:57 PM IST
After bob and andhra bank state bank of india cuts base rate

ప్రపంచ అతిపెద్ద బ్యాంకుల జాబితాలో చేని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)  ఖాతాదారులకు దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభవార్త అందించింది. బేస్ రేటులో 5 బేసిస్ పాయింట్ల మేర కోతపెట్టింది. ప్రస్తుతం 9శాతంగా ఉన్న బేస్ రేటు తాజా తగ్గింపుతో 8.95 శాతానికి చేరింది. అయితే ఎస్బీఐ నిర్ణయంతో ఏప్రిల్ 2016కు ముందు గృహ రుణం పోందిన లబ్ధి చేకూరనుంది. ఈ రేట్లు అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానుందని ఎస్బీఐ  ప్రకటించింది. అయితే ఎంసీఎల్ఆర్ రేటు ఎలాంటి మార్పులేదు.

ఐసిఐసీఐ సహా యాక్సిస్ బ్యాంకులు కొత్తగా తమ వద్ద గృహ రుణం తీసుకునే ఖాతాదారులకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఎస్బీఐ మాత్రం బేస్ రేటును కటాప్ చేసి తమ వద్ద రుణం తీసుకున్న రుణదాతలకు లబ్ది చేకేర్చనుంది. అక్టోబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చర్యకు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి.  ఈ రివ్యూలో బేస్ రేటులో కోత పెడుతుందనే అంచనాలు మార్కెట్‌ వర్గాల్లో  నెలకొన్నాయి.

అయితే మైక్రో ఎకానమిక్ డాటా ఆధారంగా రేట్ ఉండకపోవచ్చని ఎస్బీఐ అభిప్రాయపడింది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు బేస్ రేటులో కోతలను అమలు చేశాయి.  బ్యాంక్ ఆఫ్ బరోడా బేస్ రేటును 35 బేసిస్ పాయింట్ల మేర కుదించి 9.15 శాతానికి తగ్గించింది. ఈ బాటలో ఆంధ్రా బ్యాంకు సైతం 15 బేసిస్ పాయింట్లు తగ్గించి బేస్ రేటును 9.55 శాతంగా ప్రకటించింది. బ్యాంకులు బేస్ రేటు ఆధారంగా రుణాల మంజూరీని చేపట్టే విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles