Raids across Delhi to nab Honeypreet Insan పట్టుకోండి చూద్దాం.. అంటూ హనీప్రీత్ పరుగులు..

Honeypreet insan moves delhi high court for anticipatory bail

Honeypreet Insan, Gurmeet Ram Rahim Singh, honeypreet, raids to nab Honeypreet, Panchkula court, Haryana police, Dera chief arrest, Delhi HIgh court, latest news

The Haryana Police conducted raids across Delhi to nab jailed Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh's adopted daughter Honeypreet Insan who has been on the run.

పట్టుకోండి చూద్దాం... అంటూ దత్తపుత్రిక పరుగులు.. పోలీసులు తనిఖీలు

Posted: 09/26/2017 10:47 AM IST
Honeypreet insan moves delhi high court for anticipatory bail

డేరా సచ్చా సౌదా ముసుగులో భక్తి పారవశ్యానికి బదులు అక్కడ జరిగిందంతా అడపడచులపై అత్యాచారమే. బెదిరింపు, భయాందోళనకు గురిచేసి.. బాబా ముసుగు కప్పుకుని యధేశ్చగా సాగాని నేరసామ్రాజ్యమే డేరా సచ్చా సౌదా. నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, అన్యాయాలు.. పగిలిన పడతులు చేతి గాజాలు.. ధిక్కిరించిన వారి కళేభరాలు.. బలవంతంగా వ్యభిచారాలు ఇలా ఒక్కటి కాదు అనేకానేక హింసతో సాగిన సామ్రాజ్యం ఇద్దరు సాధ్వీల మొక్కవోని ధైర్యం నేలకూల్చింది. గుర్మిత్ రామ్ రహీం సింగ్ బాబా అట కట్టించింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించేలా చేసింది.

ఎంతటి బలమైన అన్యాయమనా.. బలీయమైన న్యాయం ఎదుట లోంగిపోకతప్పదన్నది.. దర్మమే జయిస్తుందన్నది ఈ ఘటనల్లో నిరూపితమైంది. అయితే గుర్మిత్ నేరాల్లో తన వంతుగా పాలుపంచుకున్న అయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇసాన్ బాబా జైలు జీవితం ప్రారంభించిన నాటి నుంచి తప్పించుకుని తిరుగుతుంది. అమె విదేశాలకు వెళ్లారని, నేపాల్ బార్డర్ నుంచి తప్పించుకున్నారని అనేక కథనాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడ ముమ్మరంగా తనిఖీలు చేసి.. చిట్టచివరకు గుర్మిత్ సింగ్ వద్దకే వచ్చి అచూకీ గురించి అరా తీశారు.

అయితే హనీప్రీత్ లేదన్న వార్తలు నిజం కాదని అమె తరపు న్యాయవాది ప్రదీప్ అర్య అన్నారు. అమె ఢిల్లీలోనే వున్నారని.. అమె పంచకుల న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు వారెంట్ నుంచి మినహాయింపు కోరుతూ ముందస్తు బెయిల్ పిటీషన్ తీసుకోనేందుకు ఢిల్లీ హైకోర్టును అశ్రయించారని అయన చెప్పారు. గుర్మిత్ రామ్ రహీం సింగ్ బాబా సాగించిన నేరసామ్రాజ్యలలో తనకేమాత్రం పాత్ర లేదని, తాను కేవలం అయన పుత్రికను మాత్రమేనని అమె యాంటిసిపేటరీ బెయిల్ పిటీషన్ లో పోందుపర్చానని అర్య చెప్పారు. హనీప్రీత్ ముందస్తు బెయిల్ పై మధ్యామ్నం న్యాయస్థానం విచారించనునందని సమాచారం.

అయితే హనీప్రీత్ ఇసాన్ ఢిల్లీ రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని ముందస్తు బెయిల్ పిటీషన్ కోసం అశ్రయించారన్న సమాచారం అందుకున్న హర్యానా పోలీసులు అమె కోసం ఐదు బృందాలుగా విడిపోయి మరీ అన్వేషిస్తున్నారు. విదేశాలకు వెళ్లిందన్న వార్తల నేపథ్యంలో అమె ఇంకా దేశంలోనే అందులోనూ దేశ రాజధానిలోనే వుందన్న వార్త తెలిసి విస్మయానికి గురైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అమెను ఎలాగైనా అరెస్టు చేసి పంచకుల కోర్టులో నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసుల ప్రయత్నాలు ఫలించేనా.? అన్నది వేచి చూడాల్సిందే.

 

నాకు ప్రాణ భయం ఉంది : హనీప్రీత్

తనకు ప్రాణభయం ఉందని, ఎక్కడ, ఎవరు చంపేస్తారోనన్న ఆందోళనలో ఉన్నానని హనీప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హర్యానా డ్రగ్స్ మాఫియా నుంచి తనకు ముప్పు ఉందని హనీ అందులో పేర్కొంది. దీనిపై నేటి మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కోర్టు విచారణ చేబడుతుంది.

తనకు బెయిల్ ఇస్తే, ఎక్కడికీ పారిపోబోనని, పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆమె హామీ ఇచ్చింది. తాను నేపాల్ కు పారిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఎక్కడ తనను చంపేస్తారోనన్న భయంతో దాగుండి పోయానని చెప్పింది. కాగా, ఈ పిటిషన్ పై విచారణ జరిగే సమయానికి తాము కూడా కోర్టులో ఉండాలని భావిస్తున్న సిట్ అధికారులు సైతం హైకోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గుర్మీత్ శిక్ష అనంతరం చెలరేగిన అల్లర్లతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, బాబాతో తనకు సంబంధాలున్నాయన్న వార్తలపై ఆమె కలత చెందినట్లు హనీప్రీత్ తన లాయర్ తో చెప్పినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles