husband held for blackmailing wife with her obscene photos నీలి చిత్రాలతో భార్యను బ్లాక్ మెయిల్ చేసి..

Husband held for blackmailing wife with her obscene photos

husband, wife, obscene videos, intimate photos, e-mail, paradeep indian oil corperation, sunil kumar, vishaka, hyderabad, maintainance case, vizianagaram, cyberabad cyber crime police, vizianagaram, andhra pradesh, crime

A newly woman has alleged that her husband outraged her modesty by sending obscene videos and pictures of her, to her brother and blackmailed her to withdraw cases against him

నీలి చిత్రాలతో భార్యను బ్లాక్ మెయిల్ చేసి..

Posted: 09/26/2017 10:18 AM IST
Husband held for blackmailing wife with her obscene photos

భార్య అంటే అర్థాంగి.. అంటే భర్తలో సగం. అయితే ఈ మాటలపై నమ్మకం లేని ఓ ఘనుడు తన భార్యను దారికి తెచ్చుకోవాలని ఏకంగా భార్యకు నీలి చిత్రాలు పంపించాడు. మారిటల్ రేప్ అనే అంశం చట్టంగా మారాలన్న డిమాండ్ తెరపైకి వచ్చేది ఇలాంటి ఘనాపాటిలు వున్నందునేని.. అయితే ఒక్కరిద్దరి కోసం యావత్ పురుష జాతిని దోషులు చేయడం, భారతీయ వైవాహిక చట్టానికి వున్న పవిత్రతను, వివాహ వ్యవస్థను దెబ్బతీయడం ఇష్టం లేక ప్రభుత్వాలు మారిటల్ రేప్ అనే అంశాన్ని సమర్ధించడం లేదు.

కానీ ఇలాంటి సైకో సన్నాసులు వుంటే మాత్రం అలాంటి చట్టాలు రాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ భర్త ఏం చేశాడనేగా మీ డౌట్.. సైబరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఒడిశాలోని పారాదీప్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన చిలకపాటి సునీల్ కుమార్ కు 2007లో వివాహమైంది. కొద్ది రోజులకే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అతడి వేధింపులు తాళలేక విశాఖలో సునీల్ పై భార్య క్రిమినల్ కేసులు పెట్టారు. తనకు జీవన భృతి ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించింది.

తనపై కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెడుతున్న భార్యను దారికి తెచ్చుకోవాలని భావించిన సునీల్ కుమార్ అమెకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తనపై వేసిన రెండు కేసులను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. అంతటితో ఆగని అతడు.. గత నెల 11న రాత్రి నకిలీ ఈమెయిల్ ఖాతాను సృష్టించి ఆమెకు నీలిచిత్రాలు పంపాడు. తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల 19న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 20న ఒడిశాలో అతడిని అరెస్టు చేసి కటకటా వెనక్కి నెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles