TS Exam Questions: Poke Fun Of Naidu చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ప్రశ్నాపత్రం..

Ts exam questions poke fun of naidu pepper spray

TSPSC, Nursing Staff Exams, Pepper Spray, Telangana, Lagadapati Rajgopal, Chandrababu, rendu kalla siddhantham, parliament, current affairs, gurukulam educational institutions, Andhra pradesh

A few questions asked in the examination conducted by TSPSC for the Recruitment of Staff Nurses in state-owned Gurukulam educational institutions have become a topic of discussion

చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ప్రశ్నాపత్రం..

Posted: 09/19/2017 10:24 AM IST
Ts exam questions poke fun of naidu pepper spray

తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అవకాశం దొరికినప్పుడల్లా.. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది. ఓటుకు నోటు కేసు వెలుగుచూసిన నేపథ్యంలో తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నారని అరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తరువాత తాను తన ఫామ్ హౌజ్ లో  చేపట్టిన చండీయాగానికి మాత్రం చంద్రబాబును ప్రత్యేకంగా అహ్వానించారు. ఓ సారి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తే.. మరోసారి మాత్రం చంద్రబాబును తూలనాడుతూ.. విమర్శలు గుప్పిస్తారు.

ఇద్దరు చంద్రులు పంచాయితీ నేపథ్యంలో అటు కొంతకాలం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా తనదైన శైలిలో సముదాయించారు. ఇక ఇప్పటికీ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు మాత్రం వారి విబేధాలు, అంశాల వారీగా డిమాండ్ల నేపథ్యంలో ఇంకా శరాఘతంగానే పరిణమిస్తున్నాయి. ఇక ఆయన కూడా కేంద్రానికి తన నివేదికను ఇస్తున్నా.. ఇటు మీడియాకు మాత్రం ఇద్దరు చంద్రులు రాష్ట్ర ప్రగతి కోసం అనునిత్యం కష్టిస్తున్నారని కితాబిస్తూనే వున్నారు. ఇక ఇద్దరు చంద్రులు అటూ కేంద్రంతోనూ సన్నిహిత సంబంధాలే కలిగివున్నారు.

అయితే ఆ మధ్య అమరావతిలో రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యఅతిధిగా అహ్వానించిన కార్యక్రమంలో.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా అహ్వానించిన చంద్రబాబు.. కేసీఆర్ కూ అక్కడ వున్న క్రేజ్ ను చూశారు. దీంతో ఆ కార్యక్రమం నేపథ్యంలో కేసీఆర్ ముఖాన్ని నల్లగా చేసిన ఫోటోలతో ఢిల్లీలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన విషయం ఇంకా కేసీఆర్ మర్చిపోనట్లు వుంది. ఇక దానికి ప్రతీకారం తీర్చుకనే క్రమం కోసం వేచి చూస్తున్న కేసిఆర్ కు తెలంగాణ నర్సింగ్ ఉద్యోగాల రూపంలో అవకాశం లభించింది.

అందుకే కాబోలు తెలంగాణ నర్సింగ్ ఉధ్యోగ ప్రశ్నాపత్రంలో రెండు కళ్ల సిద్దాంతం ఎవరిదీ అన్న ప్రశ్న వేశారు. దీనికి బదులు ఎవరైనా ఎమని ఇవ్వాలి.? ఎలా ఇవ్వాలి. రెండు కళ్ల సిద్దాంతం అంటూ ఉదరగొట్టిన పార్టీలు అదే ప్రాణికతను పట్టుకుని ఇంకా వేళాడుతున్నాయని ఎవరైనా ఎలా భావిస్తారు.? అసలు దీనికి ప్రామాణికత ఏమిటి..? ఇక పార్లమెంటులో పెప్పర్ స్ప్రే వాడింది ఎవరన్న ప్రశ్నకు కూడా పెట్టి.. అసలు తెలంగాణ రాష్ట్ర అవిర్భావం నేపథ్యంలో జరిగిన ఘటనలపై అవగాహన వుందా.. లేదా..? అని ప్రశ్నలు సంధించడం ఇప్పుడ చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC  Nursing Staff Exams  Pepper Spray  Telangana  Lagadapati Rajgopal  Chandrababu  

Other Articles