sheshu kumari alleges even chandrababu decieved her టీడీపీలోని యూజ్ అండ్ త్రో విధానంపై కార్పరేటర్ ఫైర్

Sheshu kumari slams tdp for use and throw policy in party

sheshu kumari weeps after mayor declaration, tdp corporators anger on party leadership, kakinada muncipal corporation, mayor, sunkara pavani, sheshu kumari, thota narasimham, latest news

kakinada coporator and mayor aspirant sheshu kumari slams tdp for use and throw policy in party and alleges that MP thota narasimham decieved her.

టీడీపీలోని యూజ్ అండ్ త్రో విధానంపై కార్పొరేటర్ ఫైర్

Posted: 09/17/2017 06:09 PM IST
Sheshu kumari slams tdp for use and throw policy in party

తెలుగు దేశం పార్టీలో వాడుకుని వదిలేసి విధానంపై, టీడీపీ అగ్రనాయకత్వంపై కార్పోరేటర్ శేషు కుమారి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ మేయర్ పదవి తనకు దక్కతుందని చివరి వరకు ఎంతో అశించిన శేషుకుమారి.. చివరికు తనకు దక్కకుండా సుంకర పావనికి పదవి దక్కడంతో.. అమె తీవ్ర కలత చెందారు. పార్టీలో యూజ్ అండ్ త్రో విధానాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాకినాడ మేయర్ పదవికి పార్టీ అగ్రనాయకత్వం సుంకరి పావనికి అందజేయడంతో అమె తన అదృష్టం బాగుందని భావిస్తున్న క్రమంలో.. మేయర్ పదవిని దక్కించుకోలేకపోయిన ఇతరులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదే పదవికోసం అశించిన శేషుకుమారి ఏకంగా పార్లమెంటు సభ్యుడు, మంత్రి ఎదురుగానే కంటతడి పెట్టారు. గత ఎనిమిదేళ్లుగా పార్టీ అభ్యున్నతి కోసం తాను ఎంతగానో శ్రమించానని... తన సేవలను హైకమాండ్ గుర్తించలేదని ఆమె వాపోయారు.

ఎంపీ తోట నరసింహం తనకు వ్యతిరేకంగా పని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా కాపునేనని... దీనికి సమాధానం ఏమిటో ముందుముందు చూపిస్తానని హెచ్చరించారు. పార్టీలోకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను తీసుకొచ్చారని, ఆ తర్వాత అన్ని విధాలా అవమానించారని మండిపడ్డారు. జిల్లా నాయకత్వం తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా... అధినేత చంద్రబాబు తనకు న్యాయం చేస్తారని భావించానని.. కానీ చివరకు తనకు అన్యాయం జరిగిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles