Journalist Shot At, Robbed In Bihar. Attacker Arrested పాత్రికేయుడు పంకజ్ మిశ్రాపై అగంతకుల కాల్పులు..

Hours after gauri lankesh another journalist shot at in bihar

Journalist Pankaj Mishra, Rashtriya Sahara, Pankaj Mishra, Bihar, Dilip Kumar, ​Journalist shot, gauri lankesh, bihar journalist, pankaj mishra, bihar, arwal, attack on journalists, bihar, journalist, scribe, crime

Pankaj Mishra, a journalist working for Hindi newspaper Rashtriya Sahara was shot by two bikers on Thursday in the Arwal district of Bihar.

పాత్రికేయుడు పంకజ్ మిశ్రాపై అగంతకుల కాల్పులు..

Posted: 09/07/2017 07:57 PM IST
Hours after gauri lankesh another journalist shot at in bihar

కర్ణాటకలో ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త, గౌరీ లంకేశ్ హత్యోదంతంపై యావత్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే మరో జర్నలిస్టుపై కాల్పలు జరగడం కలకలం రేపుతుంది. పాత్రికేయ వృత్తి అంటే కత్తిమీద సాములాంటిదని, అయినా దేనీకి వెరవకుండా, అశపడకుండా, లోంగకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించాలన్న తప్పనతో శ్రమింస్తున్న కలం పుత్రులను టార్గెట్ చేయడం పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

గౌరీ లంకేశ్ ను అమె ఇంటి అవరణలోనే దేశవాలి తుఫాకీతో కాల్చిచంపి.. 48 గంటలు కూడా తిరక్కముందే బీహార్ లో మరో పాత్రికేయుడిపై అగంతకులు కాల్పులతో తెగబడ్డారు. బీజేపి మిత్రపక్షం జేడీయూ అధికారంలో వున్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జంగిల్ రాజ్యం కాకుండా చూస్తామని గత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన బీజేపి.. ప్రస్తుతం అధికారాన్ని పంచుకుంటున్నా.. ఏకంగా పాత్రికేయులనే టార్గెట్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పాత కక్షలే జర్నలిస్టు మృతికి కారణమా..?

బీహార్ అల్వార్ జిల్లాలో జర్నలిస్టుపై జరిగిన దాడికి పాతకక్షలే కారణమా..? అంటే అవునన్న అనుమానాలే కలుగుతున్నాయి. హిందీ పత్రిక రాష్ట్రీయ సహారాలో పని చేసే పంకజ్ మిశ్రా అనే జర్నలిస్టుపై ఇవాళ ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సరిగ్గా ఆయన బ్యాంకు నుంచి లక్ష రూపాయల నగదును తీసుకుని బయటకు వస్తుండగా తుపాకీతో కాల్చిన దుండగులు అయన చేతిలోంచి నగదును తీసుకుని పరారయ్యారు. అయితే దుండగులిద్దరూ ఆయన గ్రామానికే చెందినవారేనని గుర్తించిన పోలీసులు వారిలో ఒక్క అనుమానితుడ్ని మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత కక్ష వల్లే కాల్పుల కలకలం రేగిందని అల్వార్ ఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gauri lankesh  bihar journalist  pankaj mishra  bihar  arwal  attack on journalists  bihar  journalist  scribe  

Other Articles