Maha minister's daughter gives up scholarship ప్రభుత్వ స్కాలర్ షిప్ వద్దు.. దారికొచ్చిన మంత్రి కూతురు..?

Maharashtra minister s daughter decides to give up scholarship

Social Justice Minister, Maharashtra, scholarship, Shruti Rajkumar Badole, downtrodden, backward, IIT Madras, Astro phyiscs

After the controversy over the scholarship awarded to Maharashtra's Social Justice Minister's daughter, the beneficiary Shruti Rajkumar Badole has decided to give up the scholarship.

ప్రభుత్వ స్కాలర్ షిప్ వద్దు.. దారికొచ్చిన మంత్రి కూతురు..?

Posted: 09/07/2017 07:09 PM IST
Maharashtra minister s daughter decides to give up scholarship

మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్ కుమార్ బాదోల్ కుమార్తె శ్రుతి తనకు ప్రభుత్వం నుంచి లభించిన స్కాలర్ షిఫ్ ను వదులుకునేందుకు తాను సిద్దమని ప్రకటించారు. తాను ఎవరి అవకాశాలనో లాక్కుని ఇతరులకు లభించాల్సిన సదుపాయాన్ని తాను పోందానన్న వాదనలను అమె తోసిపుచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ వంద యూనివర్శిటీలలో సీటు లభించిన వారికి మాత్రమే అందించే అవకాశమిదని, అయితే తాను ఇతరుల అవకాశాన్ని లాక్కుని అక్రమంగా లబ్దిపోందుతున్నట్లు వస్తున్న వార్తలను అమె ఖండించారు.

విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్ షిప్‌ పూర్తిగా ఉత్తమ విద్యార్ధులకేనని.. తన తండ్రి మంత్రి కాని సమయం నుంచి తాను స్కాలర్ షిప్ లను అందుకున్నానని, అయితే ఇప్పుడు తన తండ్రి మంత్రిగా వున్న కారణం చేత తాను అక్రమంగా లబ్దిపోందానని చెప్పడం సమంజసం కాదని అమె అన్నారు. తాను ఐఐటీ మద్రాసు నుంచి తన విద్యాబాస్యం పూర్తి చేశారనని, ఎంఎస్సీ యూనివర్శిటీ అప్ సుస్సెక్స్ నుంచ పూర్తి చేశారనని, తన అస్ట్రో ఫిజిక్స్ రంగంలో రాణించాలన్నది తన స్వప్నమని అమె తెలిపింది.

ప్రపంచ అత్యత్తమ 26 విశ్వవిద్యాలయాల్లో తాను అస్ట్రో ఫిజిక్స్ కోర్సును చేసేందుకు ఎంపికయ్యానని, అయితే తన మెరిట్ కోటాలోనే తాను ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ పోందానని చెప్పారు. అయితే తన చదువుల కోసం రుణాలను మాత్రం తీసుకోవద్దని తాను తన తండ్రితో చెప్పానని, అందుకు తాము ఇప్పటి వరకు తన సోదరుడి ఉన్నత విద్యకోసం కడుతున్న రుణమే కారణమని అమె తెలిపారు. అయితే తన తండ్రి మూలంగా తనకు అందివచ్చిన స్కాలర్ షిప్ దూరంమైవతుందని అమె అన్నారు.

కాగా అంతకుముందు శ్రుతి తండ్రి.. మంత్రి రాజ్ కుమార్ దాబోల్ మాట్లాడుతూ.. ‘నా కుమార్తె స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకుంది. ఎంపికైంది. ఇందులో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. సెలక్షన్‌ కమిటీలో కూడా నేను లేను. శ్రుతి దరఖాస్తును పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆమెను ఎంపికచేశారు. అంతేగాక ఈ శ్రుతి స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు సీఎం ఫడణవీస్‌కు కూడా చెప్పాం’ అని రాజ్‌కుమార్‌ అన్నారు. అయితే శ్రుతి స్కాలర్‌షిప్‌కు ఎంపికైనా.. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం తీసుకోవాలా? లేదా? అన్నదానిపై తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles