I-T warns against cash dealings above Rs 2 lakh రూ.2లక్షల దాటిన నగదు లావాదేవీలపై ఐటీ హెచ్చరిక

I t department warns against cash dealings above rs 2 lakh

digital transactions, cashless transactions, liquid cash Transactions, transactions more than rs 2 lakh, demonetisation, penalty, income-tax department, arun jaitley, cash dealing, Twitter, Social Media, Twitterities, Narendra Modi

The Income-Tax Department warned people against cash dealings of Rs 2 lakh and more, saying any violation of this cap will invite strict penalty under law.

హెచ్చరికో.. హెచ్చరిక.. ఇది ఐటీ హెచ్చరిక

Posted: 08/29/2017 12:57 PM IST
I t department warns against cash dealings above rs 2 lakh

అవును మీరు చదవిని శీర్షక నూటికి నూరుపాళ్లు కరెక్టే. ఎందుకంటే ఇది నిజంగా హెచ్చరికే. కేంద్ర ప్రభుత్వ సంస్థ జారీ చేసిన హెచ్చరిక. ఈ హెచ్చరికను మీరారంటే.. ఇక మీ బేబులకు భారీగా చిల్లులు పడవచ్చు. ఏమిటీ హెచ్చరిక అంటున్నారా..? ఎవరి జారీ చేశారని అడుగుతున్నారా..? కేంద్ర అదాయ పన్ను శాఖ అధికారులు దేశ ప్రజలకోసం జారీ చేసిన హెచ్చరిక. గత ఏడాది నవంబర్ 8న అమల్లోకి వచ్చిన పాత నోట్ల రద్దు నేపథ్యంలో తెరపైకి వచ్చిన నగదు రహిత లావాదేవీల విషయంపైనే ఈ హెచ్చరిక.

ఇకపై దేశప్రజలు ఏవ్వరూ రెండు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు చేస్తే వారికి భారీగా అపరాధ రుసుము వసూలు చేయబడుతుంది. ఈ మేరకు అదాయ పన్ను శాఖ అధికారులు ఓ బహిరంగ ప్రకటనను వెలువరించారు. దీని ప్రకారం రూ. 2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరపటం చట్టవిరుద్దం. ఇకపై ఇలాంటి లావాదేవీలకు పాల్పడితే భారీగా జరిమానా వసూలు చేస్తామని ప్రకటనలో పేర్కోంది. కేంద్ర ప్రభుత్వం ఈ అర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో తీసుకువచ్చిన ప్రత్యేక అర్థిక బిల్లులో ఈ విషయాలను పోందుపర్చింది.

దీంతో ఇకపై రూ. 2 లక్షలకు పైగా నగదు లావాదేవీలు జరిపిన పక్షంలో చట్టప్రకారం జరిమానా తప్పదని పేర్కోంది. ఒక్కరోజులో ఒక వ్యక్తి నుంచి రూ. రెండు లక్షలకు మించి ఒక్క లావాదేవీలో కానీ లేక పలు లావాదేవీలలో కానీ నిర్వహించరాదు. ఇది ఏ ఒక్క సందర్భంలోనైనా, లేక కార్యక్రమానికి సంబంధించినా లావాదేవీయైనా రెండు లక్షలకు మించరాదని పేర్కొనింది. రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలను నిర్వహించడం నిషిద్దమని ప్రకటనలో పేర్కోనింది. స్థిరాస్తి బదిలీ కోసం రూ.20 వేలకు మించి నగదు తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ చేయరాదు.

వృత్తిపరమైన, వ్యాపారపరమైన ఖర్చులు రూ.10 వేలకు మించి నగదు రూపంలో చెల్లించరాదని అదాయ శాఖ ప్రకటించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. నగదు రహిత లావాదేవీలు జరపండి. పారదర్శకంగా ఉండండి అని సూచిస్తుంది. అలాంటి ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పడుతుంటే ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ కు ఈ మెయిల్‌ ద్వారా సమాచారం అందించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. బడ్జెట్లో భాగంగా చేసిన చట్టసవరణ ద్వారా ఏప్రిల్‌ 1 నుంచి రెండు లక్షల నిబంధన అమల్లోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టంలో చేర్చిన 269 ఎస్టీ నిబంధన ప్రకారం… రూ.2 లక్షల నిబంధన ఉల్లంఘించిన వారికి వందశాతం జరిమానా వేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles