RBI announces new Rs 50 currency note కొత్త రూ. 50 నోటు ప్రకటన వెనుక రీజన్ అదేనా..

New rs 50 note to hit market soon old note to continue

RBI, Reserve Bank of India, Rs 50 note viral, Rs 50 note, New Rs 50 note, new Rs 20 note, Rs 20 new note, demonetisation, new 50 rupee note, Urjit R Patel, Rs 50 notes issued, RBI Rs 50 note, RBI issues new note, New Rs 50 note, Congress, RBI, economy

A new fluorescent blue Rs 50 banknote in the Mahatma Gandhi series, slightly smaller and slimmer than the existing note will soon be introduced by the Reserve Bank of India.

కొత్త రూ. 50 నోటు ప్రకటన వెనుక రీజన్ అదేనా..

Posted: 08/19/2017 10:18 AM IST
New rs 50 note to hit market soon old note to continue

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఏడాది చేసిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరిందో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్న కేంద్రం.. ఈ చర్యతో కొత్త నోట్లను మాత్రం ప్రజల ముందుకు చేర్చింది. గత కొన్నేళ్లుగా చలమాణిలో వున్న పాత పెద్ద నోట్లను ప్రజలకు దూరం చేసిన కేంద్రం ఒక్కసారిగా కొత్తగా అంతకు రెండింతల పెద్దనోటును సంపన్నులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తరువాత రూ. 500 నోట్లను కూడా రంగు, రూపులను మార్చి తీసుకువచ్చింది.

అసలు పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెప్పి.. అంతకన్నా పెద్దనోటును ఎందుకు తీసుకువచ్చిందన్న విషయాన్ని ఇప్పటికీ కేంద్రం స్పష్టం చేయలేకపోతుంది. ఇక ఈ నోటును రద్దు చేస్తామని ఎవరు వాటిని దాచుకోవద్దని చెప్పిన కేంద్రం.. తాజాగా పార్లమెంటు సాక్షింగా రెండు వేలనోటును రద్దు చేయమని స్పష్టం చేసింది. అసలు నోట్ల రద్దుకు ముందు కేంద్రం చెప్పిన నిర్ణీత లక్ష్యాలు ఏ మేరకైనా సఫలీకృతమయ్యాయా..? అంటే అందుకు కూడా బదులు లేకుండా పోయింది.

కాంగ్రెస్ తీసుకువచ్చిన నోట్లను కాదని, బీజేపి హయాంలో ముద్రించిన నోట్లను ప్రజలు వాడకలో వినియోగించాలన్న స్వార్థం.. నోట్ల రద్దుతో ప్రజల దృష్టిని మరల్చి.. అధికారికంగా కొత్త పెద్ద నోటును దేశంలోని సంపన్నులకు చేరవేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుందన్న విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నరేంద్రమోడీ ప్రభుత్వం నోటివ వెంట నిత్యం పేదల పేరు జపిస్తున్నా.. ఒనగూర్చే లాభం మాత్రం సంపన్నులకే నన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.

నోట్ల రద్దు వ్యవహరంలో.. కొత్త నోట్లను చలమానిలోకి తీసుకురావడంలో ఇప్పటికే అనేక విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్రం.. వాటిని ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు కొ్త్త రెండు వేల రూపాయల నోట్లు రావడం లేదని, ప్రశ్నించిన నేపథ్యంలో కొత్త రెండు వందల నోట్లను తీసుకువస్తున్నామని చెప్పిన కేంద్రం రూ. 50. రూ.20లపై మాత్రం మాటమాత్రమైనా పార్లమెంటు సభ్యులకు సమాచారం అందించలేదు.

ఈ క్రమంలో కొత్తగా రూ,50 నోటు కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందంటూ అంతర్జాలంలో ఫోటోలు లీకై.. అవి కాస్తా వైరల్ గా మారాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన రిజర్వు బ్యాంకు అఘమేఘాలపై ప్రకటనను చేసింది. అవును అంతర్జాలంలో వైరల్ గా మారిన కొత్త రూ.50 నోటు నిజమేనని అంగీకరిస్తూ.. త్వరలోనే తాము ఈ కొత్త నోటును ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పింది. ఫోరొసెంట్ నీలం వర్ణంలో ఈ నోటులను తీసుకువస్తున్నామని స్పష్టం చేసింది.

నీలాకాశం వర్ణంలో వుండే ఈ నోటుపై హంపి రథం ఫొటో ముద్రించారు. గాంధీజీ చిత్రం కూడా ఉంది. ఈ నోటుపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకాన్ని ముద్రించారు. కాగా గతంలో వచ్చిన కొత్త నోట్ల భిన్న డిజైన్లు, బిన్న సైజలపై ప్రతిపక్షాలు సభలో ఏకీపారేడంతో.. కొత్తగా అందుబాటులోకి రానున్న రూ.50 నోటు విషయంలో అర్బీఐ జాగ్రత్తలు తీసుకుంది. అర్బీఐ పారామీటర్ల ప్రకారం ఈ నోటు 66 మిల్లీమీటర్ల ఎత్తు.. 135 మిల్లీబీటర్ల అడ్డం కొలతలు వస్తుందని స్పష్టం చేసింది. కొత్త నోట్లు వచ్చినా పాత యాభై రూపాయల నోట్లు కూడా చెల్లుతాయని రిజర్వ్‌బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles