good time for vultures, Rs 100 cr funds to safe guard రాబందులకు రాజయోగం.. పరిరక్షణకు రూ.100 కోట్లు

Good time for vultures rs 100 cr funds to safe guard

Vultures, Vulture "restaurants", parsi, telangana, haryana, west bengal, nepal, India, south asia, decline in vulture population, safe food ti endangered birds, safe guard, Rs 100 cr funds to safe guard vultures

Vulture "restaurants" have sprung up in South Asia over the past decade to offer safe food to the endangered birds, which lost more than 99 percent of their species population.

రాబందులకు రాజయోగం.. పరిరక్షణకు రూ.100 కోట్లు

Posted: 08/18/2017 05:35 PM IST
Good time for vultures rs 100 cr funds to safe guard

రాబందులు అంటే తెలుసా..? నేటి తరం వారికి వీటి గురించి అసలు తెలియదు. అందుకు కారణాలు రెండు. ఒకటి అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా. రెండు రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం. అసలు రాబంధు అంటే అదో రకమైన పెద్ద పక్షి. చనిపోయిన పశువుల్ని ఎక్కడ వున్నా వాటిపై వాలి వాటిని పూర్తిగా తినేసే పక్షులే రాబంధులు. కళేబరం కుళ్లిపోయి దుర్వాసన రాకుండా, బ్యాక్టీరియా వ్యాపించకుండా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడేవి. అలాంటి రాబందులు ఇప్పుడు అంతరించే దశకు చేరకున్నాయి. ఒకప్పుడు లక్షల్లో ఉన్న వీటి సంఖ్య… ఇప్పుడు దేశవ్యాప్తంగావందల సంఖ్యలో కూడా లేదు.

అందుకని.. రాబందులను పరిరక్షించేందుకు పార్సీలు చర్యలు మొదలుపెట్టారు. వీరికెందుకు రాబందులపై అంత శ్రద్ద అంటే. పార్సీల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని తీసుకువెళ్లి ఎత్తయిన ప్రదేశంలో వదిలేస్తారు. రాబందులు వాటిని ఆరగిస్తే మంచిదని భావిస్తారు. అయితే ఇప్పుడవి అంతరించడం పార్సీలకు తీవ్ర సమస్యగా మారింది. దీంతో వాటి సంతతిని పెంచే కార్యక్రమానికి రూ. వంద కోట్ల వరకూ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.  ఎవరి నమ్మకాలు వారివి.

పర్యావరణం మేలు చేసే రాబందులు సంఖ్య గణనీయంగా తగ్డడంపై అటు పరిశోధకులు, వణ్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాబందులు అంతరించిపోయాయి. 97 శాతానికిపైగా రాబందులు ఇప్పటికే అంతరించగా, మిగిలిన మూడు శాతాన్ని సురక్షితంగా పెంచేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ రాబందు కనిపించినా వాటి ఫోటోలను తీసి పంపితే రూ. లక్ష బహుమతిగా ఇస్తామన్న ప్రచారం కూడా జరిగిందంటే.. పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థం చేసుకోవచ్చు.

దీంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబంధుల  సంరక్షణకు చర్యలు చేపట్టింది. తెలంగాణ అటవీశాఖ బెజ్జురులోని రాబందుల సంరక్షణపై దృష్టి సారించింది. వీటి సంరక్షణలో భాగంగా పశువులకు జబ్బు చేసినప్పుడు ఇచ్చే ‘డైక్లోఫినాక్‌’ ఔషదాన్ని నిషేధించింది. ఈ మందు వల్ల జంతువులు చనిపోయిన తరువాత వాటిని తిన్న రాబందులకు సంతానోత్పత్తి కాకపోవడం కూడా కారణమని తెలుసుకున్న పర్యావరణ వేత్తలు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడంతో ఈ మందుపై నిషేధం విధించారు. దీనికి తోడు వాతావరణ కాలుష్యం, రసాయనాలు కూడా అవి అంతరించిపోవడానికి కారణాలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం హరియాణాలోని ‘పింజోర్‌’, పశ్చిమ్‌బంగలో రాబందుల సంరక్షణ పునరుత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేసింది. అలాగే కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం పాలరాపుగుట్టలో వాటి ఉనికి కన్పించడంతో ఆశలు చిగురించాయి. అప్పుడక్కడ పది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిని సంరక్షణపై దృష్టి పెట్టడంతో ఇప్పుడవి 30కి పైగా ఉన్నాయి. రాబందుల సంరక్షణ, ప్రత్యుత్పత్తి, పెరుగుదలపై అటవీశాఖ జాగ్రత్తలు తీసుకుంటుండటంతో రాబందులకు రాజయోగం పట్టిందని ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vultures  Vulture "restaurants"  parsi  telangana  haryana  west bengal  nepal  India  south asia  

Other Articles