Indian troops foil Chinese incursion bid in Ladakh పాక్ తరహా కవ్వింపులకు తెగబడుతున్న చైనా

As doklam standoff continues indian troops foil chinese incursion bid in ladakh

Indian Army, China, People's Liberation Army, Jammu and Kashmir, Pangong Lake, Doklam, India, China, Customary meet, Ladakh

Indian and Chinese forces had a brief face-off in the north bank of Pangong lake in Ladakh on early Tuesday morning and lasted for about half-an-hour until both sides pulled back.

పాక్ తరహా కవ్వింపులకు తెగబడుతున్న చైనా

Posted: 08/16/2017 11:57 AM IST
As doklam standoff continues indian troops foil chinese incursion bid in ladakh

డోక్లామ్ లోని ట్రై జంక్షన్ ప్రాంతంలో ఇండియా, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, అందుకు చర్చలు ఒక్కటే మార్గమని అమెరికా సలహా ఇచ్చింది. ఆయ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను ఇరు మాత్రమే పరిష్కరించుకోగలరని అమెరికా పేర్కొంది. రెండు వర్గాలనూ కూర్చుని చర్చలు జరపాలని మాత్రమే తాము చెప్పగలమని అమెరికా ప్రతినిధి హెదర్ నౌరెట్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఈ తరహా ఉద్రిక్త పరిస్థితి రెండు దేశాలకూ మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు.

కాగా, గత జూన్ లో డోక్లామ్ ప్రాంతంలో డ్రాగన్ సైన్యం రహదారి నిర్మాణానికి పూనుకోగా, భారత్ సైన్యం అడ్డుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పరిస్థితి మారిపోయింది. ఈ ప్రాంతం తమదంటే తమదని రెండు దేశాలూ వాదనలకు దిగుతూ, ఇరువైపులా తమ తమ సైన్యాలను మోహరించాయి. ట్రై జంక్షన్ పాయింట్లను చైనా అతిక్రమిస్తోందని భారత్ ఆరోపిస్తుండగా, ఈ ప్రాంతం తమదేనని నెహ్రూ హయాంలోనే రాతకోతలు జరిగాయని చైనా అడ్డగోలు వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే.

డోక్లామ్ లో నెలకోన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సరిహద్ద వెంట వున్న ఐదు ప్రాంతాల్లో భారత్- చైనా సైన్యాలు సమావేశం కావడం అనవాయితీగా వస్తుంది. జమ్ముకాశ్మీర్ లోని దౌలత్ బేగ్‌, చుషూల్‌, అరుణాచల్ ప్రదేశ్ లోని కిబిథూ, బుమ్లా, సిక్కింలోని నాథూలా వద్ద ఈ భేటీలు గత కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. కానీ ఉద్రక్తత నేపథ్యంలో దేశ 71వ వేడుకల నేపథ్యంలో మాత్రం ఈ ఐదు ప్రాంతాల్లో ఏ ఒక్కచోటా సమావేశం జరగలేదని ఆర్మీ ప్రకటించింది.

రివాజుగా వస్తున్న ఈ అనవాయితీ సమావేశాలకు రావాల్సిందిగా భారత్ చైనా అధికారులకు సమాచారం అందించి.. ఫోన్ ధ్వారా కూడా మరోమారు విన్నవించినా వారి నుంచి స్పందన రాలేదని అర్మీ వర్గాలు తెలిపాయి. ఇక అదే అదనుగా భావించిన చైనా బలగాలు.. లడఖ్‌ ప్రాంతంలో ప్యాంగ్యాంగ్‌ సరస్సుకు భారత్‌ వైపు ఉన్న ఒడ్డున.. ఫింగర్‌ ఫోర్, ఫింగర్‌ ఫైవ్‌ ప్రాంతాల్లో చొరబాటుకు ప్రయత్నించాయి. భారత బలగాలు అప్రమత్తంగా వ్వవహరించి చైనా చొరబాటును తిప్పికొట్టాయి. దీంతో తోకముడిచిన చైనా బలగాలు.. భారత బలగాలపై రాళ్లదాడికి పాల్పడ్డాయి. అయినా వెనక్కు తగ్గని భారత బలగాలు చైనా మూకలను ధీటుగా ఎదుర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Army  China  People's Liberation Army  Jammu and Kashmir  Pangong Lake  Doklam  India  China  

Other Articles