చేతిలోంచి మీ సెల్ ఫోన్ జారి పడితే.. అయ్యే ఏం జరిగిందో అని ఒకటికి పది సార్లు చూసుకుంటారు. కానీ ఏకంగా కిలోమీటర్ల ఎత్తు నుంచి సెల్ ఫోన్ జారిపడితే.. ఔరా తునాతునకలు కాక మరేమవుతుంది..? అంటారా.. కానీ కాదు. ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఈ ఫోన్ సురక్షితంగా వుంది. అంతేకాదు నిక్షేపంగా పనిచేస్తుంది. ఇక్కడే మీకు అంత ఎత్తు నుంచి నుంచి ఎందుకు జారిపడిందన్న అనుమానాలు కలుగుతున్నాయి కదూ. అయితే అది పడింది ఏకంగా వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమనాం నుంచి.. ఇక అనుమానాల సంఖ్య రెట్టింపైంది కదూ..
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన బ్లేక్ హెండర్సన్ తన చిన్నతరహా విమానంలో ప్రయాణిస్తుండగా... అతి సమీపం నుంచి వేరొక విమానం దూసుకురావడాన్ని గమనించాడు. వెంటనే తన శాంసంగ్ గెలాక్సీ ఎస్5 మొబైల్ ఫోన్ తీసి ఈ విమానం దృశ్యాలను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. అలా ఆ విమాన దృశ్యాలను చిత్రీకరిస్తున్న క్రమంలో తన చేతిలోంచి సెల్ ఫోన్ జారి కిందపడిపోయింది. కెమెరా అన్ లో వున్నందున విమాన దృశ్యాలతో పాటుగా సెల్ ఫోన్ కిందపడుతున్నప్పడు దృశ్యాలు కూడా అందులో నమోదయ్యాయి.
ఆలా విమానంలోంచి జారిపడిన మొబైల్ కెంటుకీ నగరంలోని ఓ ఇంట్లోని పెరట్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీనిని ఆ ఇంట్లోని గార్డనర్లు చూసి ఇదిగో నీ ఫోన్ అని ఒకరు మరోకరితో అనగా, ఇది నాది కాదు.. నా ఫోన్ నా జేబులోనే వుంది అని మరోకరు బదులివ్వడం.. తీరా దాన్ని తీసి చూడగా, వీడియో రికార్డింగ్ కూడా అన్ లోనే వుందన్న విషయాన్ని గమనించి.. రికార్డైన దృశ్యాలను చూడటం ఇదంతా చకచకా జరిగిపోయింది.
చివరకు బ్లేక్ హెండర్సన్ తన టెలికాం కంపెనీ సహాయంతో జీపీఎస్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ను తిరిగి పొందాడు. హెండర్సన్ బంధువైన రాబర్ట్ ర్యాన్ స్మార్ట్ ఫోన్ లో రికార్డయిన దృశ్యాలను యూట్యూబ్లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారాయి. అయితే ఇంకా మీకు ఒక డౌట్ వుంది కదూ. ఇంతకీ ఆ సెల్ ఫోన్ ఏ కంపెనీదనేగా.. సామ్ సంగ్ గాలక్సీ ఎస్ 5. అయితే కేవలం సెల్ ఫోన్ అమ్మకాల కోసం సామ్ సంగ్ ఇలాంటి వార్తలను సృష్టిస్తుందన్న విమర్శకులు కూడా లేకపోలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more