నంద్యాలలో ఇక వైసీపీ గెలిచినట్లేనా? | YSRCP Definitely win in Nandyala By Election

Silpa mohan reddy confident on nandyala by poll victory

Silpa Mohan Reddy, Silpa Mohan Reddy Nomination, Mamdyala By Poll YSRCP Won, TDp or YSRCP, Nandyala By Election, Nandyala Election, TDP YSRCP Objections

Election Commission Accepts Nominations of Silpa Mohan Reddy. Silpa says Justice won and confident on victory.

నంద్యాలలో ఇక వైసీపీ గెలిచినట్లే...

Posted: 08/08/2017 08:05 AM IST
Silpa mohan reddy confident on nandyala by poll victory

ఉపఎన్నికల బరిలో ఉత్కంఠ రేపుతూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు కాసేపు కలకలమే రేపింది. వైసీపీ తరపున పోటీపడుతున్న అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమర్పించిన నామినేషన్ అఫిడవిట్ పై అభ్యంతరం, ఆపై పెద్ద హైడ్రామే నడిచింది. ఎదుర్కొనలేక ఇలా సాకులతో అధికార పక్షం కుట్రలు పన్నుతోందని వైసీపీ ప్రతిదాడికి దిగింది. చివరకు ఆయన నామినేషన్ ను ఆమోదిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ నుంచి ప్రకటన రావటంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈ నైతిక విజయంతో నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టేనని శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ విష ప్రచారం చేసినా అవి
విఫలమయ్యాయని, నంద్యాల బరిలో న్యాయమే గెలుస్తుందని తెలిపారు. ఓటమి భయంతోనే తన నామినేషన్ ను తిరస్కరించడానికి కుట్రలు చేశారని ఆరోపించిన ఆయన, టీడీపీ అధికార
దుర్వినియోగానికి పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. ఎన్నికల నిబంధనల మేరకు తన నామినేషన్ ను అధికారులు ఆమోదించారని శిల్పా మోహన్ రెడ్డి తెలిపాడు.

స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ కుట్రలను ప్రోత్సహిస్తున్నారని, బూత్ ల వారీగా మంత్రులను నియమించి, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ, కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్నారని ఆరోపించాడు. ఇక అధికార టీడీపీ ఎన్ని ప్రలోభాలను పెట్టినా వైకాపాదే విజయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశాడు. అభ్యంతరాల పేరుతో ఎంతో తప్పుడు ప్రచారాన్ని చేసి, చిన్న విషయాన్ని తమ అధీనంలోని ఎల్లో మీడియా ద్వారా ఎంతగా ప్రచారం చేయించినా, చివరకు నైతిక ఓటమి వాళ్లకు తప్పలేదని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyala  By Poll  YSRCP  Silpa Mohan Reddy  Bhuma Brahmannada Reddy  

Other Articles