SC refuses to stay EC's notification for NOTA in RS polls కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. నోటా తీయనుంది అభ్యర్థుల తాట..

Rajya sabha polls in gujarat supreme court refuses to stay nota

Supreme Court, Rajya Sabha elections, None Of The Above, Nota, amit shah, ahmed patel, Gujarat, Congress, BJP

In a blow to the Congress' hopes in the Rajya Sabha polls in Gujarat, the Supreme Court today ruled that it will not stay the poll panel's notification allowing None Of The Above (NOTA) option in the elections.

కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. నోటా తీయనుంది అభ్యర్థుల తాట..

Posted: 08/03/2017 01:26 PM IST
Rajya sabha polls in gujarat supreme court refuses to stay nota

ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో జరగనున్ను రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మునుపెన్నడూ లేని విధంగా గుజరాత్ రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో నోటా బటన్ ను వినియోగించనున్నారు. అయితే ‘పై వారెవరూ కాదు అని తెలిపే నోటా బటన్ ను రాజ్యసభ ఎన్నికలలో వినియోగించడంపై కాంగ్రెస్ పార్టీ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానంలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలలో నోటా బటన్ తోనే జరుగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గతంలో మాదిరాగా కాకుండా ఈ సారి ఎన్నికలలో నోటా బటన్ విధానాన్ని తీసుకురావడంతో సుప్రీంకోర్టును అశ్రయించిన కాంగ్రెస్.. నోటా బటన్ పై స్టే విధించాలని కోరుతూ పిటీషన్ వేసింది. అయితే ఈ పిటీషన్ ను క్రితం రోజున విచారణకు స్వీకరించిన న్యాయస్తానం.. ఇవాళ విచారించింది. మునుపటిలా కాకుండా ఈ సారి జరగనున్న ఎన్నికలలో నోటా బటన్ ను వినియోగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యసభ ఎన్నికల్లోనే తొలిసారిగా నోటా విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. నోటాతోనే గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది.

ఈ నెల 8న గుజరాత్ లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానాన్ని వినియోగించరు. ఓటేసిన ఎమ్మెల్యేలు తమ బ్యాలెట్ పత్రాన్ని తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్ కు చూపించిన తర్వాతే బ్యాలెట్ బాక్సులో వెయ్యాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. గుజరాత్ అసెంబ్లీ ద్వారా మూడు స్థానాలకు జరగనున్న ఎన్నికలలో బీజేపి తరపున కేం్దరమత్రి సృతి ఇరానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు బరిలో నిలువగా, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Rajya Sabha elections  None Of The Above  Nota  Gujarat  Congress  BJP  

Other Articles