Narcotic Case threat calls to Journalist from Drug Mafia

Journalist receives threat calls in drug case

Drug Case, Drug Case Peddler, Peddler Threat Journalist, Hyderabad Drug Case, Dark Net Site Drug Case, Journalist Akun Death Threat, Narcotic Case Threat, Threat Calls in Drug Case

Journalist get Threat Hyderabad Drug Case. Drug Peddler announced Fatwa reward on Journalist Head in internet.

డ్రగ్ కేసులో మరో బెదిరింపు

Posted: 08/02/2017 08:59 AM IST
Journalist receives threat calls in drug case

డ్రగ్స్ వ్యవహారంతో దేశం చూపు మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ వైపు మళ్లింది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులకు సిట్ విచారణ నేపథ్యంలో జాతీయ మీడియా సైతం ఇక్కడి వ్యవహారాలను ప్రముఖంగా ప్రచురించింది. ఈ వ్యవహారంలో ముందుగా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని డిసైడ్ అయిన తెలంగాణ సర్కార్ ఎక్సైజ్ ఎన్స్ ఫోర్స్ మెంట్ ఐజీ అకున్ సభర్వాల్ కు పూర్తి పవర్ ను కట్టబెట్టింది. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అసలు డ్రగ్స్ దందాపై పూర్తి వివరాలు సేకరించిన ఓ జర్నలిస్టుకు కూడా ఇలాంటి బెదిరింపులే రావటం వెలుగు చూసింది.

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు చెందిన సదరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ తన పరిశోధనలో 'డార్క్ నెట్' సైట్ ద్వారా ఈ దందా జరుగుతోందని రాశాడు. భారత్ కు మ్యాడ్లీబూటెడ్‌ ఐడీతో ఒక పెడ్లర్ భారీగా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడంటూ కథనంలో పేర్కొన్నాడు. ఈ కథనం చదివిన సదరు డ్రగ్ పెడ్లర్... ఇంటర్నెట్ లో ఫత్వా జారీ చేశాడు. ఫేస్ బుక్ ద్వారా సదరు జర్నలిస్టు, అతని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన వాటితో ఒక పోస్టర్ తయారు చేయించాడు. ఆ జర్నలిస్ట్ ను చంపిన వారికి నాలుగు బిట్‌ కాయిన్లు (రూ.7.2 లక్షలు), కుటుంబ సభ్యుల్ని చంపితే ఆరు బిట్‌ కాయిన్లు (రూ.10.8 లక్షలు) అందజేస్తానని వెలకట్టాడు.

ఓ స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకున్న సదరు జర్నలిస్టు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఐపీ అడ్రస్ ద్వారా డ్రగ్ పెడ్లర్ ను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Drug Case  Journalist  Threat Call  

Other Articles