Nitish has anti-Congress component in his blood: Modi ‘‘నితీష్ రక్తంలో నిజంగా అలాంటిది వుందా..!’’

Nitish kumar has anti congress component in his blood sushil modi

Sushil Kumar Modi, bihar deputy chief minister, RJD, nitish kumar, bihar chief minister, nitish kumar-narendra modi, NDA, Narendra Modi, Lok Sabha, Lok Sabha elections, congress, lalu prasad yadav, politics

Senior BJP functionary Sushil Kumar Modi, who was sworn in as deputy chief minister, believes Nitish Kumar-Narendra Modi combine+ will create miracles in Bihar and ensure NDA's massive victory in 2019 Lok Sabha elections.

‘‘నితీష్ రక్తంలో నిజంగా అలాంటిది వుందా..!’’

Posted: 07/28/2017 11:50 AM IST
Nitish kumar has anti congress component in his blood sushil modi

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. 17 ఏళ్ల స్నేహాన్ని వదులుకుని.. ఆ తరువాత వచిచన బీహార్ రాష్ట్ర ఎన్నికలలో మహాగట్ బందన్ పేరుతో కాంగ్రెస్‌, అర్జేడీలతో కలసి పోటీ చేసని నితీష్ రక్తంలోనే వ్యతిరేకతా బావం వుందా..? అంటే అవుననే అంటున్నారు బీజేపి బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సుషీల్ కుమార్ మోడీ. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత భావం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రక్తంలోనే ఉందని అన్నారు.

మహాగట్ బందన్ పేరుతో నితీశ్ లాంటి నిజాయితీ పరుడు.. అవినీతి పరుడైన అర్జేడీ అధినేత లాలూ లాంటి వ్యక్తుల ముందు మోకరిల్లలేదని.. ఇది ఆహ్వానించదగిన పరిణామమని ఆయన చెప్పారు. మహాగట్ బంధన్ అసహజమైన భాగస్వామ్యం అని మోదీ వర్ణించారు. 2019నాటి ఎన్నికల్లో నితీశ్‌- మోదీల భాగస్వామ్యం రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించనుందని, లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి స్థానాలన్నీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే నితీశ్ మహాకూటమి నుంచి విడిపోయేందుకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపి ఇవే విషయాలను ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయిందని నెట్ జనులతో పాటు.. లాలూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. బీహార్ ఎన్నికలకు ముందు లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన నరేంద్రమోడీ.. రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క పైసాను కూడా ఎందుకు విధిల్చలేదని నిలదీస్తున్నారు. బీహార్ రాష్ట్ర అభివృద్ది పేరు చెప్పి బీజేపి పార్టీ.. నితీశ్ ను లొంగదీసుకుని ప్రజాతీర్పును అపహాస్యం చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. స్వార్థరాజకీయాలను పక్కనబెట్టి ఇప్పటికైనా ప్రజా సంక్షేమం కోసం శ్రద్ద వహించాలని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushil Kumar Modi  RJD  nitish kumar-narendra modi  NDA  Narendra Modi  Lok Sabha  politics  

Other Articles