వివాదాస్పద వ్యాఖ్యాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ గతంలో ఓ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా, వాటిపై చర్యలు తీసుకోవాలని టీ న్యాయశాఖ నిర్ణయించుకుంది.
నాలుగేళ్ల క్రితం సెప్టెంబరు 29, 2013లో నగరంలోని షాయినాయత్ గంజ్లో జరిగిన విశాల గోరక్ష గర్జన సనాతన ధర్మ సభలో పాల్గొన్న రెబల్ రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్యే ప్రసంగంపై షాయినాత్ గంజ్ పోలీసులు సెక్షన్ 143 (ఎ) కింద కేసు నమోదు చేసి చార్జీషీటును కోర్టులో సమర్పించారు. అయితే ఆయనపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ మహేందర్రెడ్డి న్యాయశాఖకు ఓ లేఖ రాశాడు.
దీనిపై స్పందించిన న్యాయశాఖ చర్యలకు అంగీకరిస్తూ ఓ జీవో పాస్ చేసింది. ఈ వ్యవహారంలో బీజేపీ ఢిల్లీ పెద్దలను సంప్రదించి వాళ్లు ఓకే చెప్పిన తర్వాతే ఓ నిర్ణయానికి వచ్చిన సీం కేసీఆర్ ముందుకు సాగమంటు న్యాయనిపుణులకు సూచించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య అయోధ్య రామమందిర అంశాన్ని ప్రస్తావిస్తూ... నిర్మాణాన్ని అడ్డుకుంటే తలలు నరుకుతానంటూ హెచ్చరించాడు. ప్రాణాలు ఇవ్వడానికే కాదు.. తీయడానికైనా సిద్ధమంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం రేగింది. వివాదాస్పద ప్రకటనలతో ఓ వర్గానికి తిరుగులేని నాయకుడిగా ఎదగాలని, ముంబయిలోని శివసేన పార్టీ నాయకులలాగా హైదరాబాద్ లో సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ కొందరు ముస్లిం నేతలు రాజాసింగ్ ను విమర్శిస్తుంటారు కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more