తెలంగాణతో పోలిస్తే ఏపీ ఎంత దారుణం అంటే... | AP Government Failure In Providing Basic Facilities

Revenue flows ap to telangana

AP Telangana Facilities, AP Govt Basic Facilities, AP Telangana Tax Differences, AP People Flows to Telangana, Badrachalam, Tummala Comments on AP Government Facilities

Andhra Pradesh Government Failure In Providing Basic Facilities in all fields. Border people flows to Telangana for all necessities due to rate differences.

టాక్స్ ఎఫెక్ట్: ఏపీ టూ తెలంగాణ!

Posted: 07/24/2017 09:03 AM IST
Revenue flows ap to telangana

జీఎస్టీ ఎఫెక్ట్ తో పరిస్థితులు చక్కబడతాయని, ఆర్థికంగా కూడా గణనీయమైన అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందునుంచి చెబుతూ వస్తోంది. కానీ, తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి మరోలా ఉంది. ఏపీలో పన్ను బాదుడు వల్ల ధరలు పెరగటం మాట అటుంచి అసలు సేవలు కూడా దారుణంగా ఉన్నాయో నంటూ ఓ చర్చ మొదలైంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

పోలవరం ముంపు గ్రామాలు ఏపీలో కలిపేయటం తెలిసిందే. కాంగ్రెస్ తెచ్చిన విభజన చట్టం ప్రకారమే ఆ మండలాలు వచ్చి ఏపీలో కలిశాయి. కానీ, అధికారంలోకి వచ్చాక భాజపా, తెలుగుదేశం పార్టీలు తామేదో కష్టపడి సాధించుకు వచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చుకున్నాయి. పోనీ అంతవరకు సరిపెట్టుకున్నా సరే.. అలా సాధించుకున్న మండలాల ప్రజలకు ఏపీ సర్కారు సరైన వసతులు కల్పించటం లేదా? దీనిపై తెలంగాణ మంత్రి తుమ్మల చేసిన పరోక్ష వ్యాఖ్యలే నిదర్శనం.

ప్రజలు తెలిసీ తెలియకుండా ప్రెవేటు ఆస్పత్రుల్ని ఆశ్రయించి ఇళ్లూ ఒళ్లూ గుల్ల చేసుకుంటున్నారని కానీ, తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని క్రమంగా తగ్గిపోతుందని చెప్పాడు. ప్రభుత్వాస్పత్రుల్లో వసతులు మెరుగు పరుస్తున్నాం అని చెబుతూనే భద్రాచలంలోని ఓ ప్రభుత్వాస్పత్రికి వెళితే.. అక్కడ తెలంగాణ వారికంటె ఏపీ పరిధిలోని ప్రజలే చికిత్సలు పొందుతున్నారని చెప్పాడు. అయితే ఇది ఒక వైద్య సదుపాయాల విషయంలోనే లేదు. ఇంతకు ముందు ఆర్టీసీ సర్వీస్ లలో స్పష్టంగా వ్యత్యాసం కనిపించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏపీలో నివసిస్తున్న ప్రజలంతా తమ కార్లలో పెట్రోలు - డీజిల్ నింపుకోవాలంటే.. తెలంగాణలోకి వెళ్లి నింపుకుని వస్తున్నారు. గృహోపకరణాలు, సరుకుల విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ధరల్లో అలాంటి వ్యత్యాసం ఉన్నప్పటికీ,
మిగతా మౌళిక సదుపాయాలను కల్పించటంలోనూ ఏపీ సర్కార్ ఘోరంగా విఫలమవుతుందనే విమర్శలు ఇప్పుడు లేవనెత్తుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Telangana  Tax Differences  

Other Articles