Congress poster shows Kiran Bedi as Hitler ఆ మాజీ సీఎంకే ముఖ్యమంత్రి పీఠం.. 22లోగా బలనిరూపణ

Poster by puducherry congress unit shows lt governor kiran bedi as adolf hitler

puducherry,puducherry governor,Puducherry governor Kiran Bedi,Kiran Bedi as Adolf Hitler,Kiran Bedi poster,Kiran poster as Hitler,Poster of Puducherry governor as Hitler,Adolf Hitler,President of Puducherry unit of BJP V Saminathan,Puducherry Chief Minister V Narayanaswamy,Puducherry news,Kiran Bedi news, politics

The Puducherry unit of Congress releasing a poster of Governor Kiran Bedi as Adolf Hitler has become the latest reason for a tussle between the Congress-led Puducherry government and the office of the Lieutenant Governor.

ఆ గవర్నర్ పోస్టర్లపై కేంద్రం అగ్రహం

Posted: 07/21/2017 12:48 PM IST
Poster by puducherry congress unit shows lt governor kiran bedi as adolf hitler

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ పార్టీకి.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడికి మధ్య వివాదం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమెను గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం కూడా చేసిన నారాయణ స్వామి ప్రభుత్వం.. ప్రభుత్వ పాలనలో అనునిత్యం జోక్యం చేసుకుంటుందని మెడికల్ కాలేజీల విషయాల నుంచి అన్ని విషయాల్లోనూ అమెదే పైచేయిగా కొనసాగాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అరోపిస్తున్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా ఈ నెల 4న రాష్ట్రంలోని నారాయణ స్వామి ప్రభుత్వానికి ఇసమంతైనా సమాచారం లేకుండా.. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం సూచించిన ముగ్గురు బీజేపి నేతలను అమె  ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం.. వారితో ప్రమాణస్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. కిరణ్ బేడీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఎదురుదాడికి దిగుతున్నారు. కిరణ్ బేడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ లా చూపిస్తూ, కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు అభ్యంతరకర పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పోస్టర్లో కిరణ్ బేడీకి హిట్లర్ లా మీసం పెట్టి ఆమెను అవమానించేలా వున్నాయి. కిరణ్ బేడీనీ ఇలా చూపించడం పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఒక గవర్నర్ ను అందులోనూ మహిళను ఇంత దారుణంగా అవమానిస్తారా..? అంటూ చర్యలకు ఉపక్రమించిన్నట్టు సమాచారం.  అయితే ఈ పోస్టర్లపై కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ.. కిరణ్ బేడీ ఫోటోపై కేంద్రానికి వున్న ప్రేమ ఒక ప్రజాస్వామ్య దేశంలో.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఇవే పరిణామాలు ఎదురైతే.. అదెంత అవమానమని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోకి ఎక్కి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసింది ఎవరని  కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : V Narayanaswamy  Puducherry  Congress  Kiran Bedi  Adolf Hitler  Lieutenant Governor  politics  

Other Articles