Two killed as strong earthquake hits Greece and Turkey చిగురుటాకులా వణికిన గ్రీసు.. టర్కీ..

Turkey and greece hit by strong earthquake two dead and 200 injured

Earthquakes, Greece, unstable economy, tourism, holiday resorts, Turkey, Natural disasters and extreme weather, Europe, World news

At least two tourists have been killed and around 200 injured after a powerful earthquake shook the Greek Islands and Turkish coast, triggering a small tsunami.

చిగురుటాకులా వణికిన గ్రీసు.. టర్కీ..

Posted: 07/21/2017 11:56 AM IST
Turkey and greece hit by strong earthquake two dead and 200 injured

గోటి జుట్టుపై రోకటి పోటు అన్నట్లు అసలే అర్థిక మాంద్యంతో అతలాకుతల అవుతున్న గ్రీస్‌ పై ఇటు ప్రకృతి కూడా ప్రకోపించిందా..? పూట బోజనాలకే అంగలార్చుతున్న అక్కడి వారికి అసలేం లభ్యం కాకుండా కళ్ల మందే కట్టిన మేడలు, వుంటున్న ఇళ్లు కుప్పకూలేలా చేసిందా.? పుండుపై కారం చల్లినట్లుగా వైపరిత్యం గ్రీసు ను టార్గెట్ చేసిందా..? అంటే అవుననే చెప్పాలి. గత అర్థరాత్రి గ్రీస్ లో భారీ భూకంపం సంభవించింది. గ్రీస్ ద్వీపంలోని కోస్ ఐలాండ్ కు చేరువగా భూకంప కేంద్రం ఉంది. 6.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి గ్రీస్ ద్వీపం చిగురులాకులా వణికిపోయింది.

ఆర్థిక మాంధ్యంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గ్రీస్ వాసులపై ప్రకృతి ప్రకోపాన్ని చాటి వారిని గూడుకు కూడా దూరం చేసింది. గ్రీసు లోని కోస్ నగరంలో భూమి కంపించడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం అస్పత్రుల్లోకి చికిత్స నిమిత్తం తరలించారు. మరీ ముఖ్యంగా కోస్ లోని గ్రీక్ హాలిడే రిసార్టులు కూడా భూ ప్రకంపనల ధాటికి కుప్పకూలడంతో పర్యాయక రంగంపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపనుంది.

భూకంపం ధాటికి వందలాది భవనాలు నేలకొరిగాయి. కోస్‌ నగరం పూర్తిగా అతలాకుతలమైపోయింది. ఇతర ప్రాంతాల్లో కూడా భూకంప తీవ్రత కనిపిస్తున్నప్పటికీ.... కోస్ కు తగిలిన దెబ్బ చాలా తీవ్రమైనది. దీంతో రంగంలోకి దిగిన గ్రీస్‌ పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్ధ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, భూ ప్రకంపనల ప్రభావం అటు టర్కీ దేశంపై కూడా చూపిందని, పలు ఇళ్లు, భవనాలు బీటాలు వారయని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earthquakes  Greece  Turkey  Natural disasters and extreme weather  Europe  World news  

Other Articles