గోవాకు వెళ్లే ఛానెల్ అధిపతిని విచారించరా? | Media Tycoon and Anchors Names in Drugs Case

Media head and anchors names in drugs case

Tollywood Drug Case, Drug Case, Media Tycoon Drug Case, Media Tycoon Anchors Drug Case, Drug Case SIT Inquiry, Female Anchor Drug Case, Political Leaders Drug Case

Tollywood Drug Case New Names Released. Media Tycoon and Anchors Names out SIT ready to Inquire them. Courier Companies warned by Telangana Excise Enforcement.

డ్రగ్స్ పుట్ట : ఓ మీడియా అధిపతి.. యాంకర్లు!

Posted: 07/21/2017 10:39 AM IST
Media head and anchors names in drugs case

టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డ్రగ్స్ దందాలో బయటకు రాకుండా చాలా పేర్లు దాస్తున్నారన్న వాదనలు రోజురోజుకీ బలపడిపోతున్నాయి. సిట్ విచారణలో పాల్గొన్న పూరీ, శ్యామ్ కే నాయుడు నోటి నుంచి టాలీవుడ్ కు సంబంధం లేని పేర్లు కూడా వారి నోటి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లను విచారిస్తారా? లేదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

పారిశ్రామికవేత్తగా ఉన్న ఓ పేపర్ అధిపతి పాత్ర ఉన్నట్లు గుర్తించిన అందుకు తగ్గా సాక్ష్యాలను సంపాదించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారంట. నిన్నటి విచారణలో శ్యామ్ ఈ పేరు ప్రస్తావన తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఆయన కూడా పలుమార్లు గోవాకు వెళ్లివచ్చాడు కదా!, ఆయన్ను ఎందుకు ప్రశ్నించడం లేదు? అని శ్యామ్ సిట్ పోలీసులనే ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. పీయూష్ ఫోన్ లో వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న విలేకరులు, యాంకర్ల పేర్లు ఉండటంతో వీళ్లందరి వ్యవహారం తేల్చేందుకు సిట్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

అయితే ప్రాథమిక సాక్ష్యాలను సంపాదించిన తరువాతే వారందరికీ నోటీసులు పంపి విచారించే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ముందు వాళ్లకు కూడా నోటీసులు పంపి ఆపై ముందుకు సాగుతారన్న మాట.

కొరియర్ కంపెనీలకు వార్నింగ్

కొరియర్ ద్వారానే డ్రగ్స్ రవాణా జరుగుతుందన్న విమర్శల నేపథ్యంలో ప్రముఖ కొరియర్ సంస్థలకు సిట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలిసో.. తెలీకో డ్రగ్ పెడ్లర్లు వినియోదారులకు డ్రగ్స్ చేరవేసేందుకు కారణమవుతున్నారు. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయా కంపెనీల ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. ప్రముఖ కంపెనీలైన డీహెచ్ఎల్, బ్లూడార్ట్, ఫెడెక్స్ కొరియర్ సంస్థలు ఇందులో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Case  Media Tycoon  Anchors  

Other Articles