foster designs approved by ap cm cbn మార్పుల్లేవ్.. ఆ డిజైన్లు ఇక ఫైనల్..

Ap cm approves foster designs for assembly and high court

amaravati, morman fosters designs, ap assembly, ap high court, chandra babu, narayana, designs approval, diamond shaped assembly, budha statue high court

AP CM chandra babu approves norman fosters designs, diamond shaped design for ap assebly and budha stamp disgn for high court

మార్పుల్లేవ్.. ఆ డిజైన్లు ఇక ఫైనల్..

Posted: 07/12/2017 04:37 PM IST
Ap cm approves foster designs for assembly and high court

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు భవనాల తుది డిజైన్లు ఫైనల్ అయ్యాయి. అమరావతి పేరులో చారిత్రకత ఉట్టిపడేలా బుద్దస్థూపం డిజైన్ ను మొదటగా అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అందులో మార్పులను తీసుకువచ్చింది. ఇవాళ జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిజైన్లను అమోదించినా.. వాటిని ప్రతిపాదిత ప్రాజెక్టులలో మార్పులు చేశారు. బుద్దస్థూపం అకృతిని శాసనసభకు బదులుగా హైకోర్టుకు మార్చాలని సూచించారు.

దీంతో హైకోర్టు కోసం సిద్ధం చేసిన వజ్రాకార భవనం ఆకృతిని అసెంబ్లీ కోసం సిద్ధం చేయాలని, అలాగే అసెంబ్లీ కోసం సిద్ధం చేసిన బుద్ధ స్థూపం ఆకృతిని హైకోర్టు కోసం మార్చాలని ఫోస్టర్‌ బృందానికి ఆయన సూచించారు. మార్చిన హైకోర్టు డిజైన్‌ను చీఫ్‌ జస్టిస్‌కు చూపించిన తరువాత ఆయన అనుమతి మేరకు తుది ఆకృతులను రెండు రోజుల్లో సిద్ధం చేయాలని సీఎం కోరారు. శాసనసభకు వజ్ర ఆకారాన్ని పోలిన డిజైన్‌ను ఫైనల్‌ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన కోహినూర్‌ వజ్రాన్ని శాసనసభ భవనం రూపంలో తిరిగి తెచ్చుకున్నామనే భావన ప్రజల్లో వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఉంటుందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.  స్థూపం సంతోషానికి చిహ్నమని, నిజమైన న్యాయం జరిగినప్పుడే సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానిస్తూ హైకోర్టుకు ఆ మేరకు స్థూపాకారం ఫైనల్‌ చేసినట్టు సీఎం తెలిపారన్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం అనంతరం ఆ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravati  morman fosters designs  ap assembly  ap high court  chandra babu  narayana  

Other Articles