Vistara opens monsoon sale, offers tickets starting Rs 799 ఈ సారి విస్తారా వంతు.. రూ.799కే విమాన టిక్కెట్టు..

Vistara launches grand monsoon sale with tickets as low as rs 799

Vistara sale, low airfares, Srinagar-Jammu, Cheap airfares, Vistara, indigo, spicejet, airwar fare, air tickets, discount on air tickets

Full-service air carrier Vistara announced its 'Return of the Great Monsoon Sale offer'. The offer is valid for travel between July 21 and September 20

ఈ సారి విస్తారా వంతు.. రూ.799కే విమాన టికెట్టు..

Posted: 07/06/2017 09:20 PM IST
Vistara launches grand monsoon sale with tickets as low as rs 799

చౌకధర యుద్దంలోకి క్రమంగా ప్రైవేటు విమానయాన సంస్థలన్నీ చేరుతున్నాయి. ఇప్పటికే స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఏసియా లాంటి ఇతర సంస్థలు చౌకధరలో టిక్కట్లను కస్టమర్లకు అందిస్తామని ప్రకటనలు గుప్పించిన నేపథ్యంలో అదే బాటలో చేరింది మరో విమానయాన సంస్థ విస్తారా. `ద రిట‌ర్న్ ఆఫ్ గ్రేట్ మాన్‌సూన్ సేల్‌` పేరుతో ఢిల్లీకి చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రక‌టించింది. ఇందులో భాగంగా ఎకాన‌మీ త‌ర‌గ‌తి
టికెట్ రూ. 799కి, ప్రీమియం ఎకాన‌మీ త‌ర‌గ‌తి టికెట్ రూ. 2099కి అందించ‌నున్నారు.

ఈ ఆఫ‌ర్ జూలై 6, 7 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జూలై 21 నుంచి సెప్టెంబ‌ర్ 20 మ‌ధ్య చేయ‌బోయే ప్రయాణాల‌కు ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయా ప్రాంతాల మ‌ధ్య టికెట్ ధ‌రల ప‌ట్టిక‌ను విస్తారా ఎయిర్‌లైన్స్ విడుద‌ల చేసింది. వీటిలో అతి త‌క్కువగా (రూ.799) జ‌మ్మూ నుంచి శ్రీన‌గ‌ర్ మ‌ధ్య తిరిగే విమాన ప్రయాణం ధ‌ర ఉంది. అలాగే ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రూ. 2399, ఢిల్లీ నుంచి బెంగ‌ళూరుకు
రూ. 2699, ఢిల్లీ నుంచి ముంబైకి రూ. 2099గా ధ‌ర‌లు నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vistara sale  low airfares  Srinagar-Jammu  Cheap airfares  Vistara  

Other Articles