Venezuela Law Makers Brutally Attacked in Parliament

Maduro supporters attack in national assembly

Venezuela, Venezuela Parliament Attack, Venezuela National Assembly, Venezuela Nicolas Maduro, Venezuela News, Venezuela Parliament Chaos, Maduro Press Meet, Maduro Voting, President Supporters Attack Paliament, Venezuela Crisis, Venezuela Political Crisis

Mob Attacks President Nicolas Maduro Opponents as It Storms Venezuela's National Assembly. Only Venezuela's Electoral Body Can Organize Elections Maduro in a Press Meet.

ITEMVIDEOS:పార్లమెంట్ హాల్ లో డిష్యూం.. డిష్యూం...

Posted: 07/06/2017 11:13 AM IST
Maduro supporters attack in national assembly

చేతిలో పైపులు, కర్రలు, రాళ్లతో.. కంటికి కనిపించిన ఎంపీని పట్టుకుని చితకబాదిన సీన్లు పార్లమెంట్ లో సందడి చేశాయి. రక్తపు ధారలతో పార్లమెంట్ హల్ తడిసి ముద్దయిపోయింది. ఎటు చూసినా ప్రజా ప్రతినిధుల హహాకారాలు.. వెరసి వెనిజులా రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది.

ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నికోలస్ మదురో మద్దతుదారులు పార్లమెంటు పరిసరాల్లోకి చొచ్చుకొచ్చారు. వందల మంది దూసుకురావటంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా వారిని ఆపలేకపోయారు. సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష ఎంపీలపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చావబాదారు. ఘటన లో మొత్తం 12 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

 

పలువురు అధికార పార్టీ ఎంపీలు ఆందోళనకారులను నిలువరించడానికి ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. తీవ్రమైన గాయాలతో ప్రతిపక్ష ఎంపీలు బయటికి దౌడు తీస్తుండగా కెమెరా కంటికి చిక్కారు. ఆర్థిక సంస్కరణల్లో అధ్యక్షుడు మదురో ఘోరంగా విఫలమవుతూ వస్తుండటం, అవినీతి ఆరోపణలు, పైగా నిరసన గళం వినిపిస్తున్నవారిపై హింసాత్మక దాడులకు పాల్పడుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఓటింగ్ పేరిట పావులు కదుపుతుండగా, ఆయన మద్ధతుదారులు మాత్రం అది జరగనీయకుండా ఇలా దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలంటే అది కేవలం ఎన్నికల సంఘం ద్వారానే జరగాలని మదురో మీడియా సమావేశంలో తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venezuela  President Nicolas Maduro  Parliament Attatck  

Other Articles