China punishing India for its Belt and Road stance సరిహద్దులో కాలుదువుతున్న చైనా.. అడ్డుకున్న భారత బలగాలు..

China punishing india for its belt and road stance

Beijing,China,China in Indian Ocean,China submarine,East China Sea,India,India China border dispute,India-China relations,Indian Ocean,Pakistan Occupied Kashmir,Siachen,Sikkim border row,Sikkim Sector,sikkim standoff,South China Sea,string of pearls,Tibet, west bengal, border dispute, border standoff, Sikkim, surgical strike, Doklam, siliguri

The moves have nothing to do with standoff between the Indian and Chinese troops along the Sikkim border, Beijing's increased interference in the backyard of India is hardly news, yet a reason enough to be concerned about.

ITEMVIDEOS: సరిహద్దులో కాలుదువుతున్న చైనా.. అడ్డుకున్న భారత బలగాలు..

Posted: 07/05/2017 11:39 AM IST
China punishing india for its belt and road stance

గత కొన్నేళ్లుగా అటు దాయాధి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలోనే ఆ దేశంతో జతకట్టి మరీ మన దేశాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు కదం తొక్కుతున్న చైనా.. ఇప్పటికే పలు పర్యాయాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి.. జెండాలను పాతడం.. ఆనక అది తమ సరిహద్దని చెప్పుకునే చౌకబారు చర్యలకు దిగుతుంది. దీంతో భారత అర్మీ ఆ చర్యలను ఎప్పటికప్పుడు సమగ్రంగా ఎదుర్కోంటూనే వుంది.

ఈ క్రమంలో ఇటీవల సిక్కింలోని సరిహద్దు ప్రాంతం డోకాలాలో జరిగిన ఘటన తాలుకు వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడా అది కాస్తా వైరల్ గా మారింది. చైనా అర్మీ దుస్సాహాసాలను నెట్ జనులతో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఎండగడుతున్నాయి. భారత్ భూభాగంలో చొచ్చుకు వచ్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. చైనా సైనికుల దుందుడుకు చర్యలపై భారత్‌ సైన్యాలు సంయమనం పాటిస్తూ నిలువరిస్తున్నాయి. అయినా చైనా సైన్యానికులు తమ భూభాగంలోకి వెళ్లేందుకు నిరాకరిస్తూ.. వాగ్వాదానికి దిగడం, ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ వీడియోలో చైనా పీపుల్స్ ఆర్మీ సైనికులు.. భారత భూభాగంలోకి చొచ్చుకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. భారత సైనికులు వారిని అడ్డుకొని.. వారించి వెనుకకు పంపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ చైనా సైనికుడు భారత ఆర్మీ అధికారులపై తన రైఫిల్ ను గురిపెట్టిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సిక్కిం సెక్టార్‌లోని భూటాన్‌ భూభాగంలో చైనా సైన్యం నిర్మిస్తున్న రోడ్డును భారత్ సహా భూటాన్ దేశాలు వ్యతిరేకిస్తున్నా.. మరింతగా దూసుకుని వచ్చి.. భారత భూభాగంలోనే రోడ్డు పనులను చేపడుతుంది డ్రాగన్. సిక్కిం వైపున్న సరిహద్దుల్లో తమ భూభాగంలో భారత జవాన్లు అడుగు పెట్టి అక్కడ రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నారని చైనా ఆరోపణలు చేస్తోంది.  అయితే చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) సైనికులే మన భూభాగంలోకి ప్రవేశించి రెండు బంకర్లను ధ్వంసం చేశారన్నది భారత రక్షణ దళాల వాదన. మన వాదనలే కాదు ఏకంగా ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడంతో.. చైనాపై ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  china  west bengal  border dispute  border standoff  Sikkim  surgical strike  Doklam  siliguri  

Other Articles