CM Makes Blue Film Comments in Public Meeting

Karnataka cm bizarre comments in public meeting

Karnataka CM Siddaramaiah, Siddaramaiah Blue Film Comments, CM Blue Film Comments, Belagavi BJP MLA, Belagavi MLA Watch Porn, Belagavi MLA Watch Blue Film, Belagavi CM Siddaramaiah, CM Siddaramaiah Controversies, CM Siddaramaiah Porn Comments, CM Siddaramaiah Ask People, CM Siddaramaiah Bizarre Doubts, CM Comments Public Meeting

Karnataka CM Siddaramaiah asks people if they have watched blue film. people at a rally in Belagavi whether they knew what a "blue film" was and whether they had seen one.

బ్లూఫిల్మ్ ను ఒక్కసారైనా చూశారా?

Posted: 07/03/2017 08:20 AM IST
Karnataka cm bizarre comments in public meeting

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి అదే పని చేశాడు. శుక్రవారం సాయంత్రం బెళగావిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. పబ్లిక్ మీటింగ్ లో బ్లూ ఫిల్మ్ ల ప్రస్తావన తెచ్చి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ప్రజలను ఉద్దేశించి మీరెప్పుడైనా వాటిని చూశారా? అంటూ ఆయన ప్రశ్నలు కురిపించాడు.

బెళగావి బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎందుకు కోల్పోయాడో తెలుసా? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. 'దానిపై ఓసారి మీరు ఆయననే అడగండి' అని ఆయన ప్రజలకు కోరాడు. అసలు బ్లూ ఫిల్మ్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎప్పుడైనా ఒక్కసారైనా దానిని మీరు చూశారా? అంటూ చెండాలమైన ప్రశ్నను సంధించాడు. రాజకీయనాయకులంతా అసెంబ్లీని దేవాలయంలా భావిస్తారని ఆయన చెప్పాడు. అలాంటిది దాని లోపల మీ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయాడని ఆయన ఎద్దేవా చేశాడు.

'అలాంటి ఎమ్మెల్యేని అధికారంలో ఉంచకూడదు. వెంటనే దించేయాల'ని ఆయన ప్రజలకు సూచించాడు. వారు జనజీవనంలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశాడు. చేసిన తప్పుకు ప్రతిగా రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయనకు సిద్ధరామయ్య సూచించారు. అయితే ఓ సీఎం అయి ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  CM Siddaramaiah  Blue Film Comments  

Other Articles