GST India's Biggest Tax Reform Since Independence Begin

Gst freedom at midnight from tax terrorism

GST, GST India, GST Inauguration, Modi GST Inauguration, Arun Jaitley GST India, GST India Launch, Modi Speech GST Inauguration, Pranab Speech GST Inauguration, Arun Jaitely Speech GST Inauguration

President Pranab Mukherjee and Prime Minister Narendra Modi pressed a button in parliament's Central Hall at midnight to launch the Goods and Services Tax (GST), India's biggest tax reform ever. The unified tax system, said the President, is "the culmination of a 14-year journey." Speaking before him, PM Modi described GST as Good and Simple Tax, stating that it is not the achievement of any one party or government, but a shared legacy. The Congress and several other opposition parties boycotted the function.

జీఎస్టీ... ఇక పన్ను ఉగ్రవాదంపై పోరాటమే!

Posted: 07/01/2017 08:02 AM IST
Gst freedom at midnight from tax terrorism

ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వస్తు సేవల సుంకం విధానం అమలు అయిపోయింది. 142 దేశాలు అమలు చేస్తున్న ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చేసింది. పార్లమెంటులో సుదీర్ఘకాలం పెండింగ్ బిల్లుగా మిగిలిన జీఎస్టీకి మోక్షం లభించింది. భిన్న స్పందనల మధ్య శుక్రవారం జూన్ 30 సరిగ్గా అర్థరాత్రి 12(జూలై 1) దాటాక జీఎస్టీని అమలు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకటించింది.

వస్తుసేవల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠిచేస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నొక్కి వక్కాణించారు. రాజ్యాంగం ఆమోదానికి సాక్ష్యంగా నిలిచిన స్థలంపై జీఎస్టీని అమలులోకి తెస్తున్నామని ప్రధాని తెలిపారు. జీఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ టాక్స్ అని.. అర్థరాత్రి పన్ను ఉగ్రవాదంపై పోరుగా మోదీ జీఎస్టీని అభివర్ణించారు. ఇక ప్రాచీన భారత దేశం ఆర్థికంగా బలమైనదని, ఇప్పుడు నవీన భారత దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి జీఎస్టీ అమలు చేస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు.

జీఎస్టీతో నవశకం మొదలైందని వారు పేర్కొన్నారు. ప్రపంచం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మనం ఈ ఘనత సాధించడం గర్వకారణమని చెప్పారు. జీఎస్టీతో రాష్ర్టాల స్వతంత్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. జీఎస్టీతో భారతదేశ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతుందని వెల్లడించారు. ఇకపై వ్యాపార లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగనున్నట్లు పేర్కొన్నారు.

దేశం మొత్తం ఒకే పన్ను విధానం అమలులో అడ్డంకులు ఉంటాయని, వాటిని అధిగమించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. సమస్యలు అధిగమించేందుకు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. జైట్లీ, ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాలు ముగిసిన అనంతరం జీఎస్టీని ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. కాంగ్రెస్ తోసహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ సమావేశాన్ని బహిష్కరించి హాజరుకాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GST  INDIA  Inauguration  PM Narendra Modi  

Other Articles