Man Cheated over 100 women using matrimonial sites

Big cheating with matrimonial sites

Matrimonial Sites Cheat, Bangalore Man Cheat, Man Cheat 100 Girls, Boy Cheat Girls, Indian Boy Cheat Girls, Bangalore Man Cheat Girls, Bagalur Man Cheat, Matrimonial Cheating

Man arrested for cheating over 100 women using matrimonial sites in Bangalore. The Bagalur police received a complaint from a woman stating that a man had cheated her of money after promising to marry her. Following investigation, the police nabbed Sadath Khan alias Preetham Kumar on June 21. During interrogation it was found that Sadath Khan had cheated many other women.

మాట్రీమోనియల్ సైట్లలో అమ్మాయిలను వదల్లేదు!

Posted: 06/28/2017 10:00 AM IST
Big cheating with matrimonial sites

మోసం చేసేందుకు ఇప్పుడున్న జనరేషన్ వాడుకుంటున్న ఏకైక ఫ్లాట్ ఫాం సోషల్ మీడియానే. వధువు కావలెను.. అన్న ఒకే ఒక్క యాడ్ తో వంద మంది అమ్మాయిలను దారుణంగా మోసం చేసిన యువకుడి ఉదంతం బెంగళూర్ లో వెలుగు చూసింది. ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ పెట్టి వారిని నిలువునా దోచుకున్న వ్యక్తిని కటకటాల్లోకి పంపించారు పోలీసులు.

బెంగళూర్ కు చెందిన ఓ యువతి కొన్ని రోజుల క్రితం తనను ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేశాడని బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సాదత్ ఖాన్ ను ఈ నెల 21న అరెస్ట్ చేశారు. అయితే విచారణలో అతను వెల్లడించిన వివరాలతో షాక్ తిన్నారు. ఇప్పటిదాకా ఇలా 100 మందికి పైగానే మోసం చేసినట్లు సాదత్ ఒప్పకున్నాడు. రాహుల్, కార్తీక్, మహమ్మద్‌ ఖాన్, ప్రీతమ్‌ కుమార్ తదితర పేర్లతో ప్రొఫైల్స్ సృష్టించి మాట్రీమోనియల్ సైట్లలో గాలం వేసేవాడు.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని, కంపెనీ సీఈఓనని, ప్రభుత్వ అధికారినని ఇలా వరుడి కోసం వెతుకుతున్న యువతులను ఆకర్షించడం మొదలు పెట్టాడు. కాంటాక్టులోకి వచ్చిన వారిని నమ్మించి భారీ మొత్తాల్లో డబ్బు రాబట్టేవాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయి వద్ద తీసుకున్న సొమ్ముతో మరో యువతితో కలసి జల్సాలు చేసేవాడు. స్టార్ హోటళ్లకు వారిని తీసుకువెళ్లి, కార్లలో తిప్పి రంగుల ప్రపంచం చూపించేవాడు. ఆపై అవసరం వచ్చిందని మాయమాటలు చెప్పి డబ్బు లాగి మాయమయ్యేవాడు. కొందరిని శారీరకంగా కూడా వాడుకున్నట్లు చెబుతున్నాడు.

సాదత్, హసన్ ప్రాంతంలో ఐఐటీ వరకూ చదివాడు. మద్యానికి బానిస కావటంతో ఇంట్లోంచి గెంటేశారు. యశ్వంత్ పూర్ లో ఓ వెల్డింగ్ షాపులో, ఆపై కంట్రీ క్లబ్ లో టెలీ కాలర్ గా పని చేశాడు. సిస్కో, హాలెక్స్ కంపెనీల్లో టెలీకాలర్ గా పని చేస్తున్న సమయంలో అమ్మాయిలను వేధించటంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. చివరకు ఇలా ఆన్ లైన్ లో మోసానికి వందకు పైగానే యువతులను బురిడీ కొట్టించేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Matrimonial Sites  Cheat Girls  

Other Articles