ఇంతకీ నేనెవరో తెలుసా?.. ఈ ఒక్క డైలాగ్ తమను అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో వీవీఐపీలు, వాళ్ల కొడుకులు దురుసుగా ప్రవర్తించిన తీరు చాలా సార్లు చూసి ఉంటాం. అయితే ఇది ఒక్క ఇండియాకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న పాకిస్థాన్ లో కూడా ఉంది. కానీ, అది క్రూరంగానే ఉందనుకోండి.
ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి అతివేగంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలను బలితీసుకున్న ఘటన సంచలనంగా మారింది. క్వెట్టాలోని ఓ కూడలిలో హాజి అత్తా ఉల్లా అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు
నిర్వర్తిస్తున్నాడు. ఇంతలో ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతన్ని ఢీ కొట్టింది. తీరా చూస్తే ఆ కారు బెలూచిస్థాన్ అసెంబ్లీలో సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఛైర్మన్ అయిన మాజిద్ ఖాన్ అచాక్ జాయ్ ది. ఆ సమయంలో ఆ కారును నడుపుతున్న వ్యక్తీ ఆయనే కావడం విశేషం. వెంటనే ఆయన ఆగకుండా పరారయ్యాడు.
#Quetta: CCTV Footage shows that how cruel MPA of #PKMAP hit and killed the police constable.#UETAlerts #Pakistan pic.twitter.com/u7mHLlJD0r
— SherY - (@sherytheketchup) June 23, 2017
తీవ్రంగా గాయపడిన హాజీని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కాగా, ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, అతగాడి క్షమాపణలుగానీ, డబ్బుగానీ బాధిత కుటుంబం స్వీకరించేందుకు ముందుకు రాలేదు. దీంతో మాజిద్ కు ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఇక కోర్టుకు హాజరైన ఆయన మీడియాపై కూడా దాడి చేయటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more