Baby Elephant Chases Birds To Play. Falls Face-Down చిన్నారి గజరాజు.. తప్పటడుగులు.. ఏం జరిగిందో చూడండీ

Baby elephant chases birds to play falls face down

baby elephant chases birds, elephant video, baby elephant falls flat, baby elephant breaks trunk, baby elephant, birds, mom elephant, viral video, Boras Zoo, Sweden, video viral

An adorable baby elephant chasing around a flock of guinea fowls is going viral on social media for all the right reasons.

ITEMVIDEOS: చిన్నారి గజరాజు.. తప్పటడుగులు.. ఏం జరిగిందో చూడండీ

Posted: 06/24/2017 05:28 PM IST
Baby elephant chases birds to play falls face down

చిన్నారి బుజ్జాయిలు ఏం  చేసినా ముద్దుగానే వుంటుంది. అది మనుషులైనా.. లేక ఏ జీవాలైనా. ఇటు రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డి గూడెంలో అలాంటి చిన్నారి బోరుబావిలో పడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరపెడుతుంది. చిన్నారి సురక్షితంగా బయటకు రావాలని ఇరు రాష్ట్రాల ప్రజలు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. అయితే మరో చిన్నారి కూడా అటలాడుకుంటూ తప్పటడుగులు వేస్తూ కిందపడటంతో నెట్ జనుల నుంచి సానుభూతి వెల్లువవుతుంది.

పర్వత ప్రాంతం ఎత్తు పల్లాలు సహజం. అలాంటి ప్రాంతంలో అనేక జీవాలు అలమరికలు లేకుండా హాయిగా సేదతీరుతున్నాయి. కొన్ని జీవులు మేత మేస్తుంటే.. మరికొన్ని జీవులు ప్రశాంతంగా వున్నాయి. మేకలు, గేదలు, అవులు, ఏనుగులు ఇలా అనేక రకాలు ప్రాణులు అక్కడున్నాయి. అయితే అక్కడున్న ఓ చిన్నారి గజరాజు అక్కడే వున్న తన తల్లిని వీడి అడలాడుకునేందుకు పక్కకు వచ్చింది. అది మేక వెంటపడగా, అది కాస్తా తప్పించుకుంది.



దీంతో తన కన్నా పెద్దగా వుందని భావించిందో ఏంటో తెలియదు కానీ.. దానిని వీడి తల్లి వద్దకు వెళ్తుండగా, ఈ చిన్నారి గజరాజు కంటికి కోళ్లు కనిపించాయి. అవి మామూలు కోళ్లు కాదు జెనీవా కోళ్లు.. అంతే వాటిని సరదా అటపట్టించేందుకు వాటి వెంట పడింది అలా వాటి వెంట పడగా అవి తప్పించుకుంటూ తిరగడం ప్రారంభించాయి. అయితే వాటిని పట్టుకోవాలని గజరాజు. ప్రయత్నిస్తూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ పరుగెత్తుంది.

అలా వాటి వెంట పరిగెడుతున్న గజరాజు అమాంత బొక్కబోర్లా పడిపోయింది. దీంతో దాని తొండానికి కూడా దెబ్బ తగిలిందనుకుంటా.. దాంతో అక్కడే వున్న అమ్మ వద్దకు పరుగెత్తింది. తల్లి చాటున దాగుండి పోయింది. అప్పటి వరకు తన చిన్నారి విన్యాసాలను అలకించిన తల్లి గజరాజు చిన్నారి పడిపోగానే.. ఒక్కసారిగా కదిలింది. చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ బుజ్జీ ఏనుగు వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది. దక్షిణ స్వీడన్‌లోని బోరాస్‌ జూలో ఈ వీడియోను చిత్రీకరించారు. బుజ్జీ గజరాజు పక్షులను వెంటాడుతూ చేసిన విన్యాసాలు కూడా ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby elephant  birds  mom elephant  viral video  Boras Zoo  Sweden  video viral  

Other Articles