Shocking Shade of Sirisha's Case Accused Rajeev

Rajeev film girls and blackmailed

Beautician Sirisha, Beautician Sirisha Case, Sirisha Rajeev, Rajeev Character, Sirisha Case Accused, Sirisha Case Rajeev Sravan, Rajeev Sravan, Rajeev Sirisha Blackmail, Sravan Rape SIrisha

Police Reveals Shocking Facts About Beautician Sirisha's Case Accused Rajeev Character. Lot of Affairs he take Girls obscene Photos and Videos later Blackmailed.

శిరీష కేసు: నగ్న ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్!

Posted: 06/24/2017 09:32 AM IST
Rajeev film girls and blackmailed

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్ ను మెల్లిగా సైడ్ చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో అతగాడి ప్రవర్తన గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫోటో స్టూడియో
యజమాని అయిన వల్లభనేని రాజీవ్ కు ఇంతకు ముందు కూడా పలువురు యువతులతో సంబంధాలు ఉన్నాయి. ఒక్క శిరీష, తేజస్వినితోనేకాదు మరో నలుగురు యువతులతో సన్నిహితంగా మెలిగినట్టు తెలుస్తోంది. ఆఫీస్ లో అతని ల్యాప్ ట్యాప్, కంప్యూటర్లను పరిశీలించిన పోలీసులకు రాజీవ్ రాసలీలల సాక్ష్యాలు కొన్ని లభించాయంట.

ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి గంటలు గంటలు మాట్లాడే వాడని, ఆపై వారితో శారీరక సంబంధం కూడా నడిపాడని తేలిందంట. వారికి తెలియకుండా అశ్లీల ఫోటోలు,
వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి వారిని ఎట్టకేలకు వదిలించుకునేవాడని గుర్తించారు. శిరీష-రాజీవ్‌ల మధ్య వివాహేతర సంబంధముందని పోలీసులు ఇటీవల తేల్చారు. ఈ క్రమంలో శిరీషపై కూడా వేధింపులు ఏమన్నా చేశాడా? అన్న ప్రశ్నలు పుడుతున్నాయి.

తొలుత శిరీషను, తరువాత తేజస్వినిని వదిలించుకుందామని భావించిన రాజీవ్... నెల క్రితం మరోయువతితో పరిచయం పెంచుకున్నట్టు తెలిసింది. తేజస్విని పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానని బెదిరిస్తూనే విజయవాడ వెళ్లి అతడి తల్లిదండ్రులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజీవ్ ఫో్న్ లో కూడా వాళ్లతో ఏకాంతంగా గడిపిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారంట. రాజీవ్ పెద్దమోసగాడని, నేరస్వభావం ఉన్నవాడని గతంలోనే పలువురు సన్నిహితులు, స్థానికులు పేర్కొన్న విషయం తెలిసిందే.


నా కొడుకును ఇరికించారు

శిరీష కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న తమ బిడ్డ అమాయకుడని శ్రవణ్ పేరెంట్స్ చెబుతున్నారు. తమ అబ్బాయి చాలా మంచివాడని, తనకేం సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకోవైపు శ్రవణ్ కన్ను శిరీషపై పడి, అవకాశం కోసం ఎదురు చూశాడన్న కొత్త కోణం బయటపడింది. తేజస్విని సీన్ లోకి రావటంతో రాజీవ్-శిరీషల మధ్య వివాదం చెలరేగింది. దీనిని తనకు అనుకూలంగా మలుచుకోని, శిరీషను ఉపయోగించుకోవాలని శ్రవణ్ భావించాడంట. అందుకు రాజీవ్ కూడా అంగీకరించినట్లు, ఆపై ఎస్సై ప్రభాకర్ రెడ్డిని ఇందులో ఇన్ వాల్వ్ చేసినట్లు పోలీస్ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో ఒకవేళ ఎస్సై ప్రభాకర్ తోపాటు శ్రవణ్ కూడా అత్యాచారం చేశాడా? అన్న కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beautician Sirisha  Rajeev  Sravan  Blackmail  

Other Articles