After Arrest CS Karnan Plays Chest Pain Drama

Justice karnan arrested by kolkata police

Justice Karnan, Karnan Drama, Justice Karnan Heart Attack, Justice Karnan Kolkata Jail, CS Karnan Issue, CS Karnan Jailed, CS Karnan Court, CS Karnan Contempt of Court

Former Calcutta High Court judge CS Karnan was arrested later admitted in Hospital Due to Chest Pain. More than a month after the Supreme Court sentenced him to six months imprisonment for contempt of court.

అరెస్ట్.. హర్ట్ ఎటాక్.. వాట్ ఏ డ్రామా!

Posted: 06/22/2017 11:58 AM IST
Justice karnan arrested by kolkata police

అత్యున్నత న్యాయస్థానాన్నే అవహేళన చేసేలా వ్యవహరించిన మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ ను ఎట్టకేలకు కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 62 ఏళ్ల కర్ణన్ ను బుధవారం చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ (జైలు)కు తరలించారు. అయితే ఇక్కడే ఓ పెద్ద హైడ్రామా ఆయన నడిపినట్లు తెలుస్తోంది.

సరిగ్గా జైలుకు తరలిస్తుండగా తనకు గుండెల్లో నొప్పిగా ఉందని కర్ణన్ తెలిపాడంట. దీంతో వెంటనే ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేవలం హైబీపీ లో ఛాతీ నొప్పి వస్తే దానిని ఆయన ఇలా హర్ట్ ఎటాక్ అంటూ సీన్ క్రియేట్ చేసి చూపినట్లు తర్వాత వైద్య పరీక్షలలో తేలటంతో తిరిగి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే కర్ణన్ వయసు రీత్యా వైద్యుల సలహా , కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ఆస్పత్రిలో చేర్చాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని జైలు అధికారులు తెలిపారు.

కాగా, తమిళనాడు కు చెందిన కర్ణన్‌ 1983 లో బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆపై 2009 లో మద్రాస్ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించాడు. 2016 మార్చిలో 11న ఆయన్ను కోల్ కతా హైకోర్టు కు బదిలీ చేయగా, తాను దళితుడననే ఇలా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ సుప్రీంకోర్టు పైనే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు చీఫ్ జస్టిస్ తోసహా మరో ఆరుగురిని తన ముందు హాజరుకావాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేయటంతో కంటెప్ట్ ఆఫ్ కోర్టు(కోర్టు ఉల్లంఘన నేరం) కింద ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు మే 9నే ఆదేశాలు జారీ చేసింది.

అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయన చివరకు కోయంబత్తూరులోని ఓ రిసార్ట్ లో సేదతీరగా, పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి ప్రైవేట్ విమానంలో కోల్ కతాకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CS Karnan  Kolkata Jail  Contempt of Court  

Other Articles