Vehicle crashes through Pedestrians at London Mosque

Pedestrians struck by van in london again

Finsbury Park Attack, London crash, London Van Crash, London Attack, London Van Attack, London Accident, Seven Sisters Road Attack

One dead after van mows down pedestrians in 'major incident' in London. Police said early Monday at Finsbury Park Seven Sisters Road that there were “a number of casualties” and that one person was arrested after a van struck a crowd of pedestrians, including worshipers leaving a pair of mosques in North London.

లండన్ లో మళ్లీ సేమ్ ఎటాక్!

Posted: 06/19/2017 09:32 AM IST
Pedestrians struck by van in london again

ఎప్పుడు ఏ పక్క నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని ఆ నగర వాసులు ఊపిరి బిగపట్టి బతుకుతున్నారు. వరుస ఉగ్ర చర్యలు లండన్‌ ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఆత్మాహుతి దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. లండన్ వంతెన వద్ద ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోకముందే మరోసారి వ్యాన్ బీభత్సం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఫిన్స్‌ బరీ పార్క్‌ లోని సెవెన్‌ సిస్టర్‌ రోడ్డులోని మసీదు సమీపంలో పాదచారులపైకి రాత్రి 12.20 నిమిషాల సమయంలో ఓ వ్యాన్‌ వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందగానే రంగంలోకి దిగిన లండన్‌ మెట్రో పోలీసు, అత్యవసర సహాయ బృందాలు తమ పని ప్రారంభించాయి. సెవెన్ సిస్టర్ రోడ్డును మూసి వేశారు. ఘటనకు పాల్పడిన వారికోసం గాలింపు చేపట్టారు.

ఇక ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ముస్లింలు రాత్రిపూట నిర్వహించే తరావీ ప్రార్థనల అనంతరం ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున ఉగ్ర కుట్రతో ఐసిస్ ప్యూహ రచన చేసిందని నాలుగు నెలల క్రితం అమెరికా సహా పలు దేశాలు బ్రిటన్ ను హెచ్చరించినప్పటికీ తేలికగా తీసుకోవటం విశేషం.

జూన్ 3న రాత్రి 10 గంటలకు థేమ్స్‌ బ్రిడ్జిపై నుంచి ఓ వాహనం 80 కి.మీ. వేగంతో వచ్చి మారణకాండ జరిపిన విషయం తెలిసిందే. ముగ్గురు ముష్కరులు సమీపంలోని బోరో మార్కెట్‌లోకి దూసుకెళ్లి కత్తులతో‘అల్లా కోసం.. ’ అంటూ ఉన్మాదంతో దొరికినవారిని దొరికినట్టు పీకలు కోశారు.. ఈ ఘటనలో ఏడుగురు బలైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : London  Van Crash Attack  Finsbury Park  

Other Articles