Open defecation row Man Killed Rajasthan by Officials

Man objected to photography of ladies beaten to death

Open Defecation Death, Open Defecation Murder, Open Defecation Rajasthan, Rajasthan Murder, Rajasthan Man Beat Govt Officials, Objective Photos Death, Man Objected Woman Photos, Rajasthan Filming Photos, Filming Woman Photos, Pratapgarh, Pratapgarh Municipal Officials

Open Defecation row: municipal commissioner booked for lynching man in Pratapgarh in Rajasthan. The incident happened, when the deceased tried to stop sanitation workers from clicking pictures of women who had gone to relieve themselves in the open on June 16 morning. The victim has been identified as Zafar Khan (55).

అసభ్యంగా ఫోటోలు.. ఆపినందుకు భారీ మూల్యం!

Posted: 06/17/2017 12:13 PM IST
Man objected to photography of ladies beaten to death

రాజస్థాన్ లో శుక్రవారం ఘోరం జరిగింది. మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తున్న వాళ్లను అడ్డుకున్నందుకు ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు కొందరు. ప్రతాప్ ఘడ్ లోని బగ్వాసా కచ్చి బస్తీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో మున్సిపాలిటీ అధికారులపై కేసు నమోదు కావటం విశేషం.

వివరాల్లోకి వెళ్లితే.. ప్రతాప్ ఘడ్ నగర మున్సిపాలిటీ సిబ్బంది మార్నింగ్ టూర్ కు వెళ్లారు. ఇందులో భాగంగా బస్తీ ప్రాంతానికి చేరుకున్న వాళ్లు అక్కడ కొందరు మహిళలు బహిరంగంగా మల విసర్జన చేయటం చూశారు. వెంటనే తమ దగ్గర ఉన్న ఫోన్ లతో వాళ్లను ఫోటోలు తీయటం ప్రారంభించారు. ఇంతలో జఫర్ ఖాన్ అనే 55 ఏళ్ల వృద్ధుడు వాళ్లను ఆపే యత్నం చేశాడు.

వెంటనే ఉద్యోగులంతా కలిసి ఖాన్ ను కింద పడేసి కుళ్లబొడిచారు. కర్ర తో కొట్టగా తీవ్ర గాయాలు కావటంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆ వృద్ధుడు చనిపోయినట్లు తెలుస్తోంది. వాళ్లు కొట్టిన దెబ్బలకే చనిపోయాడని బంధువులు చెబుతుండగా, పోస్ట్ మార్టంలో హార్ట్ ఫెయిలూర్ తో చనిపోయినట్లు తేలటం కొసమెరుపు.

ఖాన్ సోదరుడు నూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కాగా, నలుగురిపై కేసు నమోదు కాగా, నగర పరిషత్ కమీషనర్ అశోక్ జైన్ అందులో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Open Defecation  Rajasthan  Man Killed  

Other Articles