Resolution Passed against Kiran Bedi in Puducherry Assembly

High drama in puducherry assembly

Puducherry Assembly, LG Kiran Bedi, Lieutenant Governor, Lieutenant Governor Powers, Lieutenant Governor Kiran Bedi, Narayaswamy Lieutenant Governor, Puducherry Congress, Puducherry CM LG, Puducherry LG

Puducherry Assembly passes resolution asking Centre to curtail powers of LG Kiran Bedi. Congress Alleges non-cooperative Governor.Kiran Bedi says she have not blocked any funds.

అసెంబ్లీలో బిగ్ హైడ్రామా

Posted: 06/17/2017 09:26 AM IST
High drama in puducherry assembly

తన విశేష అధికారాలతో ముఖ్యమంత్రికి పెద్ద తలనొప్పిగా మారిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ వ్యవహారం అసెంబ్లీలో రచ్చ చేసింది. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న ఆమెపై గుర్రుగా ఉన్న వి.నారాయణస్వామి ఆమెకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయించాడు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బలగన్ తీర్మానం ప్రవేశపెట్టగా, మెజార్టీ సభ్యుల మద్ధతుతో ఏకగ్రీవంగా ఓటేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఏఐఎన్ఆర్‌సీ ఈ తీర్మానాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతుండగా అడ్డుకున్నందుకు గాను ఏఐఎన్ఆర్‌సీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. కిరణ్‌బేడీ తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడం, రాజ్‌భవన్‌లో అధికారులతో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండడం, సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపిస్తుండడంతో నారాయణస్వామి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గత కొంతకాలంగా గవర్నర్, నారాయణస్వామి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ విశేష అధికారాలను అణచివేయాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఇక నుంచి కిరణ్‌బేడీ ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోజాలరని, ఏదైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆ పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వ విషయాల్లో కిరణ్‌బేడీ అనవసరంగా తలదూరుస్తున్నారని అధికార కాంగ్రెస్ సభ్యుడు ఆర్‌కేఆర్ ఆనందరామన్ ఆరోపించారు. ‘‘అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. హిట్లర్ ప్రవర్తన కంటే బేడీ ప్రవర్తన దారుణంగా ఉంటోందని ఆయన ఆరోపించారు.

యూనియన్ టెర్రరిస్ యాక్ట్ 1963 కు సవరణలు చేసి మరీ ప్రైవేట్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టడం విశేషం. విద్యాలయాల ఫండ్ లను తాను నిలుపుదల చేసినట్లు వస్తున్న ఆరోపణలపై కిరణ్ బేడీ మండిపడింది. ఫుదుచ్చేరిలో మంచిపాలన అందించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపింది. రబ్బర్ స్టాంప్ కావాలా? లేక సమర్థవంతమైన పాలన అందించే అధికారిణి కావాలా? అంటూ సీఎం ను ప్రశ్నించింది. తానేం నియంతను కాదని, రాజ్యాంగానికి లోబడే తాను నిర్ణయాలు తీసుకుంటున్నానని, తనపై పాస్ చేసిన బిల్లును తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puducherry  LG Kiran Bedi  V Narayanaswamy  

Other Articles