TDP Sr Leader Silpa Joins YSR Congress శిల్పామోహన్ రెడ్డిని సాదరంగా స్వాగతించిన జగన్..

Ysr congress president jagan welcomes shilpa mohan reddy

YSRCP, TDP, congress, Andhra pradesh, kurnool, Shilpa Mohan Reddy, YS Jagan Mohan reddy, jagan shilpa mohan reddy, AP CM, chandrababu, Minister Bhuma akhila priya, chakraphani reddy, politics

TDP Senior Leader from Kurnool, Shilpa Mohan Reddy finally joins YSR Congress party today in the presence of party president YS Jagan Mohan reddy.

శిల్పామోహన్ రెడ్డిని సాదరంగా స్వాగతించిన జగన్..

Posted: 06/14/2017 12:27 PM IST
Ysr congress president jagan welcomes shilpa mohan reddy

టీడీపీలో చేరినా తన ఇంట్లో.. మనస్సులో మాత్రం ఇంకా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాలే వున్నాయని కుండబద్దలు కోట్టిన మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తన మద్దతుదారులతో కలిసి శిల్పా మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీలోకి చేరారు. కాగా లోటస్ పాండ్ లోని ప్రధాన కార్యాలయానికి చేరకున్న శిల్పా మోహన్ రెడ్డిని జగన్ సాదరంగా అహ్వానించారు. పార్టీ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.

నంద్యాల మునిసిపల్ చైర్ పర్సన్ దేశం సులోచన, మార్క్ ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ నేతలు గోస్పాడు ప్రహ్లాదరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డితో సహా కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. వీరందరినీ పేరు పేరును జగన్ కు శిల్పామోహన్‌రెడ్డి పరిచయం చేశారు. శిల్పామోహన్ రెడ్డి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. కాగా టీడీపీ నాయకత్వం జిల్లాలో నెలకొన్న పార్టీ నేతల మధ్య విభేధాలను హ్యాండిల్ చేయడంతో విఫలం కావడంతోనే తాను వైసీపీలో చేరుతున్నానని శిల్పా ఇప్పటికే ప్రకటించారు.

శిల్పామోహన్‌రెడ్డి చేరికను కర్నూలు జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు స్వాగతించారు. శిల్పామోహన్ రెడ్డి లాంటి బలమైన నేత తమ పార్టీలో చేరడం లాభిస్తుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో తమ పార్టీ నుంచి వెళ్లిన నేతలతో పాటు.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనేక మంది నేతలు తమ పార్టీలో చేరుతారని వైసీసీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోని వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  TDP  Shilpa Mohan Reddy  YS Jagan  chandrababu  bhuma akhila priya  politics  

Other Articles