AP CM tweets Minor Rape Victim’s Name and Photo

Controversy on ap cm chandrababu tweet

Chandrababu Naidu Tweet, Chandrababu Naidu Senseless Tweet, AP CM Controversy Tweet, POSCO Chandrababu Naidu, CM Post Rape Victim Details, Chandrababu Delete Tweet, Chandrababu Rape Victim Details, CM Reveals Rape Victim Details

Andhra Pradesh CM Nara Chandrababu Naidu tweets Minor Rape Victim’s Name and Photo. According to POSCO, revealing the identity of a child victim in any form is a crime and attracts legal action.However, the tweets were deleted from both the accounts on Tuesday evening.

బాబు ట్వీట్, డిలేట్.. ఏకీపడేస్తున్నారు!

Posted: 06/14/2017 09:10 AM IST
Controversy on ap cm chandrababu tweet

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. కిడ్నాప్, ఆపై అత్యాచారానికి గురైన ఓ బాలిక ఫోటోను పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. కామన్ సెన్స్ లేకుండా వ్యవహరించాడంటూ ప్రతిపక్ష పార్టీతోసహా పలువురు మండిపడుతన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే...

ఓ బాలికను మాజీ సైనికుడు ఒకతను కిడ్నాప్ చేసి 50 రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావటంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయితే తమకు న్యాయం చేయాలని, ఆర్థిక సాయం అందించాలంటూ బాధిత బాలిక తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి వేడుకున్నారు. వారికి హామీ ఇచ్చిన అనంతరం చంద్రబాబు చేసిన పనే అసలు వివాదానికి కారణమైంది.

బాధిత బాలిక పేరు, ఫొటోను ఆయన అధికారిక ట్విట్టర్ పేజ్‌లో పోస్టు చేశాడు. ఆమెకు జరిగిన అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ట్వీట్ ను సీఎంవో కార్యాలయం కూడా రీట్వీట్ చేయటం విశేషం. నిజానికి ఇటువంటి కేసుల్లో మైనర్ బాధితుల పేర్లు, ఫొటోలు వెల్లడించడం నేరం. ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్స్‌వల్ అఫెన్సెస్ యాక్ట్ (పోస్కో) ప్రకారం కేసు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది.

అయితే చివరకు ఆ ట్వీట్‌ను ఆయన డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఓ ప్రముఖ మీడియా దాన్ని వైరల్ చేసేయటంతో రంగంలోకి దిగిన ప్రతిపక్ష వైసీపీ ఏకీపడేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Chandrababu Naidu  Rape Victim Tweet  

Other Articles