Union Minister Smriti Irani Insulted in Gujarat

Gujarat man insulted union minister smriti irani

Union Minister Smriti Irani, Smriti Irani insult, Smriti Irani Bangles, Gujarat Bangles, Smriti Irani Address, Smriti Irani Insulted, Smriti Irani Modi Three Years Rule, Smriti Irani Kaswala, Smriti Irani Gujarat, Union Minister Insult Gujarat, Smriti Irani Insult Video

Union Minister Smriti Irani was addressing a gathering as part of the celebrations of the completion of three years of the Narendra Modi government. A man Throws Bangles At Her. Arrested later the Person identified as Kaswala.

మూడేళ్ల పాలన... ఆమెకు మాత్రం అవమానం

Posted: 06/13/2017 10:55 AM IST
Gujarat man insulted union minister smriti irani

కేంద్ర ఔళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఊహించని అవమానం ఎదురైంది. ఓ యువకుడు చేసిన పనితో ఆమె షాక్ కి గురైయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్ లోని అమ్రేలీలో ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యింది.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తున్న వేళ ఓ వ్యక్తి ఆమెపైకి గాజులు విసిరి, వందేమాతరం నినాదం చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే కాస్త దూరంలో ఉండటంతో గాజులు ఆమెపై పడలేదు. ఈ హఠాత్ పరిణామంతో ఆమె కాసేపు ఆగిపోయి, ఆ తర్వాత తన ప్రసంగం కొనసాగించారు.

యువకుడిని భండారియా గ్రామానికి చెందిన కాస్వాలా గా గుర్తించారు. తాను ఏ పార్టీకి(కాంగ్రెస్) చెందిన వాడిని కాదని, రైతు రుణమాఫీ, అన్నదాతల అప్పులు, కష్టాల గురించి వివరించే ప్రయత్నంలో భాగంగా అలా చేశానని తెలిపాడు. ప్రజాప్రతినిధిని అవమానించిన నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ గాజులను తిరిగి అతగాడి భార్యకు కానుకగా పంపాలని స్మృతి పోలీసులకు సూచించిందంట.

కాగా, మోదీ సొంత రాష్ట్రంలో కేంద్ర మంత్రులకు అవమానం ఎదురు కావటం ఇది రెండో సారి. ఇంతకు ముందు మాన్షుక్ మందావీయాపై హర్ధిక్ పటేల్ మద్ధతు దారుడొకడు షూ విసిరిన విషయం తెలిసిందే. యువతను విద్యా వంతులుగా తీర్చి దిద్దటంతో ప్రభుత్వం విఫలమవుతోందని ఓ వ్యక్తి ఆ పని చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister  Smriti Irani  Insult  

Other Articles