Fired employee kills five at former workplace in Florida

Sacked employee kills five in florida

Florida Firing, Florida Incident, Florida Employee Incident, America Gun Culture, America Gun Fire, Florida Gun Fire, Florida Employee Revenge Attack, Employee Kills Boss and Staff

Sacked Florida employee shoots five ex-colleagues in head. Later attacker kills self Police said.

ఉద్యోగం పీకేశారని కాల్చి చంపాడు

Posted: 06/06/2017 07:41 AM IST
Sacked employee kills five in florida

అగ్రరాజ్యంలో గన్ కల్చర్ ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఫ్లోరిడాలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 5 గురిని దారుణంగా చంపేశాడు. ఆపై తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒర్లాండో పట్టణంలోని హ్యాంగింగ్‌ మాస్‌రోడ్డులోని ఒక పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం ఘటన జరిగింది.

కంపెనీలో పని చేసే 45 ఏళ్ల ఓ ఉద్యోగిని ఇటీవలె తొలగించారు. దీంతో ఉన్మాదిగా మారిన అతగాడు కాల్పులకు తెగించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలోనే నలుగురు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక చివరకు ఆ మాజీ ఉద్యోగి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల నుంచి ఏడుగురు సురక్షితంగా తప్పించుకున్నారని ఆరెంజ్ కౌంటీ షరీఫ్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాల్పులకు గల కారణాలపై స్పష్టత లేకపోవటంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. ఇక గతేడాది సరిగ్గ జూన్‌ నెలలోనే( 12వ తేదీన) ఒర్లాండోలోనే ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు లోనౌతున్నారు. ఇక ఈ యేడాదిలో ఇలాంటి తరహా దాడి ఇది రెండోది కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Florida  Sacked Employee  Gun Fire  

Other Articles