Asaduddin Owaisi challenges BJP Chief Amit Shah

Asaduddin owaisi slams amit shah

Asaduddin Owaisi, Asaduddin Owaisi Amit Shah, Amit Shah Owaisi, Owaisi Challenge Amit Shah, BJP Chief Amit Shah, Amit Shah Telangana Tour, KCR Owaisi Amit Shah, BJP Consistences AIMIM, Asaddudin Contest Amit Shah, Amit Shah Asaduddin Owaisi, Owaisi Open Challenge

AIMIM Chief, Hyderabad MP Asaduddin Owaisi throws down challenge to BJP chief Amit Shah. Contest on him upcoming elections.

షా సాబ్... బస్తీ మే సవాల్

Posted: 05/25/2017 10:38 AM IST
Asaduddin owaisi slams amit shah

తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనపై విమర్శలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ మీడియా సాక్షిగా షా పై విరుచుకుపడగా, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా సవాల్ విసిరాడు. హైదరాబాదులోని తలాబ్ కట్టలో జరిగిన బహిరంగ సభలో ఈ హైదరాబాద్ ఎంపీ ప్రసంగిస్తూ కమలనాథుడిపై ఫైరయ్యాడు. తెలంగాణకు వచ్చి వారినో.. వీరినో... రెచ్చగొట్టడం ఎందుకు? నేరుగా వచ్చి నాతోనే ఢీ కొట్టడంటూ ఛాలెంజ్ చేశాడు.

"తెలంగాణకు అమిత్ షా వచ్చాడు. సంతోషం, సడన్ గా తెలంగాణపై ప్రేమ పుట్టడం ఆనందకరమే. ఇంతకు ముందు చాలా సార్లు ముఖ్యమంత్రి గారికి చెప్పాను... చూడండి ఆయన వస్తున్నాడు, కొత్త కుట్రలు చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను కూడా. షా సాబ్! హైదరాబాదులో నాపై అభ్యర్థి కోసం వెతుకులాట ఎందుకు?... అసలు ఎవరో ఎందుకు, మీరే రండి... మీరు.. నేను పోటీ పడదాం... తరువాత ఏం జరుగుతుందో తెలిసిపోతుంది.

మాట్లాడితే హైదరాబాదును గెలుచుకుంటాం, గెలుచుకుంటాం అని చెబుతున్నారు. ఇదేమన్నా తినే కేకా, తినేసి నోరు తుడుచుకుందామనుకుంటున్నారు? ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడ కష్టపడ్డాం. మోదీ జీ! అమిత్ షాతో పాటు మీరు రాసిపెట్టుకోండి...సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో మిమ్మల్ని(బీజేపీని) ఓడించి చూపిస్తాం. గోషామహల్ , అంబర్ పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, ఉప్పల్ లో కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాం" అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగం కొనసాగగా.. సభ కేరింతలతో మారుమ్రోగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad MP  Asaduddin Owaisi  BJP Chief  Amit Shah  

Other Articles