Godman Chandraswami passes away ఆధ్యాత్మిక గురువు, తంత్రికుడు చంద్రస్వామి ఇక లేరు..

Chandraswami once powerful godman dies at 66

Chandraswami, Godman, P. V. Narasimha Rao, Rajiv Gandhi, Chandraswamy, Chandraswami dies, Indian tantrik, Chandraswami Latest News, chandraswami death, chandraswami dead, chandraswami passed away, Spiritual leader Chandraswami, Chandraswami dead body, is Chandraswami dead, Spiritual leader Chandraswami dead, Self-styled godman Chandraswami, Godman Chandraswami, rajeev gandhi, Chandraswami photo, Chandraswami video, Chandraswami family

Self-styled godman Chandraswami, who was a key figure in several political scandals and financial irregularities in the 1990s, has died at 66.

ఆధ్యాత్మిక గురువు, తంత్రికుడు చంద్రస్వామి ఇక లేరు..

Posted: 05/23/2017 10:49 PM IST
Chandraswami once powerful godman dies at 66

వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త చంద్రస్వామి (66) మరణించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రస్వామి ఇవాళ మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు. అధ్యాత్మిక గురువుగా.. వివాదాస్పద తాంత్రికుడిగా.. రాజకీయాలతో సహవాసం చేస్తూ.. తెర వెనుక కీలక పావులు  కదిపే అత్యంత పవర్ ఫుల్ వ్యక్తిగా పేరున్న చంద్రస్వామికి కిడ్నీలు ఫెయిలూర్ కావడం.. ఆ సమయంలోనే గుండెపోటు రావడంతో ఆయన అరోగ్యం మరింత క్షీణించింది.

పీవీ నరసింహరావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెప్పే చంద్రస్వామి.. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఒక వెలుగు వెలిగారు. తరచూ మీడియాలో దర్శనమిస్తూ.. పలు రాజకీయ నిర్ణయాల వెనుక.. ఢిల్లీ సర్కిల్స్ తో ఆయన హవా సాగేది. జాతీయ స్థాయిలో ఆయన ఫేమస్ అయిన ఆయన అసలు పేరు నేమిచంద్. అయితే ఈయనకు అటు పీవీతో పాటు ఇంకా అనేకమంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు వున్నాయని ప్రచారం జరిగింది. జాతీయస్థాయి రాజకీయాలలో ఆయన పేరు పీవీ హయాంలో మారుమోగింది. ఆ తరువాత ఆయన అనేక కేసుల్లో ఇరుక్కున్నారు.

ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడిన చంద్రస్వామిపై ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద అనేక కేసులు నమోదయ్యాయి. దీనికి తగ్గట్లే ఆయనపై ఈడీ కేసులు నమోదు చేయటం.. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా నిరూపితమై జరిమానా కట్టాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగాయి, అంతటి అధ్యాత్మిక వేత్త ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandraswami  Chandraswami Dies  Narasimha Rao  Rajiv Gandhi killing  

Other Articles