Fresh trouble for Smriti Irani in Delhi HC నిను వీడని నీడను నేనంటూ.. కేంద్రమంత్రి వెంటపడ్డ కేసు

Smriti irani fake degree row back high court asks for records

Smriti Irani, Smriti Irani fake degree case, Smriti Irani educational degree row, Delhi High Court, Smriti Irani election affidavit, Smriti Irani Degree Case, Smriti Irani Qualification, Delhi High court, Delhi University

A man called Ahmed Khan had accused Smriti Irani of claiming to be a graduate in her election papers though she did not apparently finish her undergraduate degree.

నిను వీడని నీడను నేనంటూ.. కేంద్రమంత్రి వెంటపడ్డ కేసు

Posted: 05/23/2017 05:10 PM IST
Smriti irani fake degree row back high court asks for records

కేంద్ర చేనత, జౌళిశాఖా మంత్రి స్మృతి ఇరానీ వెంట నిను వీడని నీడను నేనూ అంటూ ఓ కేసు వెంటపడుతుంది. కేంద్రమంత్రి వెనకాల పడే కేసు ఏంటా అంటూ అశ్చర్యపోతున్నారా..? కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు విద్యార్హతలను ఎన్నికల అఫిడెవిట్ లో సమర్పించిందని అరోపిస్తూ గతంలోనే ఓ కేసు అమెపై నమోదైంది. అయితే ఈ కేసు విషయంలో కిందిస్థాయి కోర్టులో ఆమెకు ఉపశమనం కూడా లభించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఏకంగా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.

దీంతో హాయిగా ఊపిరి పీల్చుకున్న స్మృతి ఇరానీకి మరోసారి తన విద్యార్హతలకు సంబంధించిన కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారణ ప్రారంభించడంతో.. ఎడతెరపి లేకుండా పోతుంది. అమె తన విద్యార్హతలకు సంబంధించిన దృవపత్రాలను కోర్టు ఎదుట సమర్పించాల్సి వస్తుంది. ఆమె విద్యార్హతలకు సంబంధించిన పత్రాలన్ని తమ ఎదుట సమర్పించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు అదేశించింది. ధృవపత్రాలను పరిశీలించిన తర్వాతే ఎవరికి సమన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కోంది.

ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో తాను డిగ్రీ పూర్తి చేసినట్లు స్మృతి ఇరానీ పేర్కొన్నారని, వాస్తవానికి ఆమె డిగ్రీ పూర్తి చేయలేదని అహ్మద్‌ ఖాన్‌ అరోపిస్తూ న్యాయస్థానాన్ని అశ్రయించారు. అయితే స్మృతి ఇరానీ కరస్పాండెన్స్‌ కోర్సు ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్ లో ఉన్నారని, అది పూర్తి చేయలేదని అయన న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కోన్నారు. తప్పుడు వివరాలు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ అహ్మద్‌ ఖాన్‌ కిందిస్థాయి కోర్టులో ఫిటిషన్‌ వేయగా ఆ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లగా విచారణకు స్వీకరించిన కోర్టు స్మృతి ఇరానీ విద్యార్హత రికార్డులు ఇవ్వాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister  smriti irani  fake degree  ahmed khan  Delhi high court  

Other Articles