kcr opponents to launch new party జూన్ 2న గులాబి వ్యతిరేక దండు ఇంటి పార్టీ

Kodandaram to attend inaugural function of new party in telangana

key activists of Telanagana movement, TJac chairman kodandaram, balladeer gaddar, telangana activist cheruku sudhakar, CM KCR, new telangana party, Telangana nti party, state formation day, TRS

The key activists of Telanagana movement kodandaram, gaddar, cheruku sudhakar, who are presently opposing CM KCR are yet to launch new party by name Telangana inti party on state formation day

జూన్ 2న గులాబి వ్యతిరేక దండు ఇంటి పార్టీ

Posted: 05/17/2017 06:32 PM IST
Kodandaram to attend inaugural function of new party in telangana

రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనమైన వేడుకలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు భావిస్తున్న క్రమంలో ఆయనకు పోటీగా టీజేఏసీ కన్వీనర్ ప్రోఫెసర్ కోదండరామ్, ప్రజా గాయాకుడు గద్దర్ సహా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి.. ప్రభుత్వ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉద్యమిస్తున్న నేతలు ఐక్యంగా ఇంటి పార్టీ వేడుకలకు హాజరుకానున్నారు. ఇంటి పార్టీ అంటే అదేదో టీ పార్టీనో, లే కాక్ టైల్ పార్టీనో కాదు. తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా శ్రమించిన చెరుకు సుధాకర్ నేతృత్వంలోని తెలంగాణ ఇంటి పార్టీ అవిర్భావ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

గులాభి దండుకు వ్యతిరేకంగా, గులాబి బాస్ నిరంకుశ విధానాలకు, నియంత పోకడలను ఎండగడుతూ.. ఆవిర్భవించనున్న కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. తెలంగాణలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న జూన్ 2 వేదికగా ఈ నూతన రాజకీయ వేదిక ఏర్పడనుంది. ఈ పార్టీకి కేసీఆర్ ఒకనాటి ఆప్తుడు తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నడుం బిగించారు. మరో ఆసక్తికరమైన పరిణామం...ఈ పార్టీకి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పూర్తి ఆశిస్సులు, ప్రజాగాయకుడు గద్దర్ అండదండలు వున్నట్లు తెలుస్తుంది.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యమ శక్తులు ఏకం అవుతూ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా పార్టీని ప్రకటించనున్నారు. ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ఆవిర్భావంలో భాగంగా తాజాగా ప్రజాగాయకుడు గద్దర్ చేతుల మీదుగా పోస్టర్  విడుదల చేయించారు. వచ్చే నెల 2న పార్టీ ఆవిర్భావ సభకు ముఖ్యఅతిథులుగా ఆర్ఎల్డి నేత అజిత్ సింగ్ కూడా హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా కృషి చేసిన ఉస్మానియా, కాకతీయ వర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థుల మద్దతు ఉన్నట్లు ఆయన వివరించారు.

ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక విధానాలను, నిరంకుశ పోకడలను ఎండగట్టారు. ఇందిరా పార్కు వద్ద అనేక సంవత్సరాలుగా ఉన్న ధర్నా చౌక్ను ఎత్తి వేయడం మిర్చి రైతులకు కనీస మద్ధతు ధర లభించకపోవడం రైతులకు బేడీలు వేయించడం వంటి ఘటనలే ఇందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమ పార్టీలన్నీ కలిసి రావాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉంది కాబట్టి ఇదే సరైన సమయమని సుధాకర్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Telangana activists  kodandaram  gaddar  sudhakar  Telangana Inti party  

Other Articles