IS claims attack on Afghan state-run TV station ఆ టీవీ స్టేషన్లో సూపైడ్ బాంబర్లు.. మా పనేనంటున్న ఉగ్రవాద సంస్థ

Suicide bombers storm state tv station in eastern afghanistan

TV station, taliban, pakistan border, Islamic state, nangarhar, Jalalabad, afghanistanspecial forces, Jalalabad, security guard, kill, Kabul, news agency, tv station, eastern province, suicide attack, Pakistan, Nangarhar, responsibility, television station, afghanistan, claim, Islamic State, Daesh, instant messaging, militant, latest news

Militant group Islamic State claimed responsibility for a suicide attack on a television station in Afghanistan's eastern province of Nangarhar that killed a security guard as well as all three attackers and wounded at least 17 people.

ఆ టీవీ స్టేషన్లో సూపైడ్ బాంబర్లు.. మా పనేనంటున్న ఉగ్రవాద సంస్థ

Posted: 05/17/2017 03:51 PM IST
Suicide bombers storm state tv station in eastern afghanistan

అఫ్ఘనిస్థాన్‌ అధికారిక టీవీ చానెల్ భవనంలోకి చోచ్చుకెళ్లిన ఉగ్రవాదులు కార్యాలయంలో భీభత్సం సృష్టించారు. జలాలాబాద్ లోని ఓ భవనంలో గల టీవీ స్టేషన్ లోకి చొరబడి ఇష్టారీతిన కాల్పులకు తెగబడ్డారు. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో వుంటే ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ ప్రాబల్యం చాటుకునేందుకు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది. ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు ప్రభుత్వ అధికారక టీవీ ఛానెల్లోకి వెళ్లి వెళ్లగానే అందులో ఇద్దరు ఆత్మాహుతి సభ్యులు తమను తాము పేల్చుకున్నారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సిబ్బంది.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు. కాగా, మరో ఉగ్రవాది మాత్రం అప్ఘనిస్తాన్ భద్రతా దళాలతో ఇప్పటికీ పోరాడుతున్నాడు. ఉదయం నుంచి కడపటి వార్తలు అందే వరకు ఉగ్రవాది బలగాలతో పోరాడుతున్నాడని సమాచారం. కాగా, ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బది అసువులు బాయగా, మొత్తంగా 17 మందిగా క్షతగాత్రులయ్యారు. అందులో ఇప్పటికే 9 మంది క్షతగాత్రులు చికిత్ప పొంది వెళ్లగా మరో 8 మంది మాత్రం అస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వారిలో ముగ్గురు పరిస్తితి విషమంగా వుందని వైద్యవర్గాలు తెలిపాయి.

భద్రతా బలగాలకు సాయుధుడికి మధ్య కాల్పులు ఇంకా జరుగుతున్నాయని ప్రావిన్షియల్‌ గవర్నర్‌ అధికారిక ప్రతినిధి అత్తౌల్లా ఖుగ్యానీ విలేకరులకు తెలిపారు. ‘ఎంతమంది సాయుధులు టీవీ స్టేషన్‌లోకి చొరబడ్డారనే విషయాన్ని మేం ఇప్పుడే స్పష్టం చేయలేము. పైగా వారు ఎవరు? వారి టార్గెట్‌ ఏమిటనే విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి లోపలికి ముగ్గురు చొరబడినట్లు కనిపిస్తోంది. వారిలో ఇద్దరు తమను తాము పేల్చేసుకోగా ఒకరు మాత్రం బలగాలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది’ అని ఖుగ్యానీ అన్నారు.

అయితే అప్ఘనిస్తాన్ లోని నాన్ఘహార్ ప్రాంతంలో అటు తాలిబన్ ప్రాబల్యం కూడా అధికంగానే వున్న నేపథ్యంలో ఎవరు ఈ దాడులకు పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు చేస్తుండగా, తాలిబన్ ఇది తమ పని కాదని స్పష్టం చేసింది. దీంతో ఇక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముందుకోచ్చి దాడులకు పాల్పడింది తామేనని ప్రకటించింది. అయితే ఇటీవల ఈ ప్రాంతంలోని ఇష్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై అమెరికా ద్రోణులు దాడులు జరిపి ముఖ్యనేతను మట్టుబెట్టడంతో ప్రతీకారంగానే ఈ చర్యలకు పాల్పడివుంటుందని అధికారులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV station  taliban  pakistan border  Islamic state  nangarhar  Jalalabad  afghanistan  

Other Articles