ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 'వాన్నా క్రై' మాల్ వేర్ సృష్టించిన కలకలం ఇంకా కొలిక్కి రాకముందే, సోమవారం నాడు మరో భారీ సైబర్ దాడి జరగనుందట. ఇక ఈ రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడం 'వాన్నా క్రై'ని ఎదుర్కొన్నంత సులువుగా ఉండబోదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత వైరస్ ల కోడింగ్ లో మార్పులు చేసిన హ్యాకర్లు, ప్రపంచ సైబర్ సిస్టమ్ ను సర్వనాశనం చేసేందుకు కదులుతున్నారని యూకేకు చెందిన డారెన్ హుస్ తెలిపాడు.
సుమారు 150 దేశాలు, 2 లక్షల కంప్యూటర్ లు ఈ భారీ హ్యాకింగ్ కు బాధితులుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా విండోస్ ఎక్స పీ యూజర్లనే ఇది ప్రధానంగా టార్గెట్ చేయబోతుందని సమాచారం. మరోపక్క మైక్రో సాఫ్ట్ సంస్థ కూడా ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తోంది. కాగా, దాదాపు 100 దేశాలను వణికించిన 'వాన్నా క్రై' నుంచి ఇప్పుడిప్పుడే పలు సంస్థలు కోలుకుంటున్నాయి.
యూకేలో 48 కంపెనీల కంప్యూటర్లు హ్యాక్ నకు గురికాగా, ఆరు కంపెనీలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇదిలావుండగా, తమ అధీనంలోకి వచ్చిన డేటాను వెనక్కు ఇచ్చేందుకు ఒక్కో కంప్యూటర్ నుంచి 300 డాలర్లు వసూలు చేస్తున్న 'వాన్నా క్రై' సృష్టికర్తలు, ఇప్పటికే 22 వేల డాలర్ల ఆదాయాన్ని పొందినట్టు తెలుస్తోంది. దీన్ని బిట్ కాయిన్ల రూపంలో మాత్రమే చెల్లించాలని వారు షరతులు పెడుతున్న సంగతి విదితమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more