railway board chairman shocks andhra bjp mps రైల్వే బోర్డు చైర్మన్ ప్రశ్న విని. ఎంపీలు షాక్.!

Railway board chairman shock andhra bjp mps

railway board chairman shocks andhra bjp mps, ak mittal shocks andhra bjp mps, why special zone in visaka, andhra bjp mp haribabu, bjp leader srinivasa rao, andhra bjp mp, haribabu, srinivasa rao, ak mittal, railway zone

railway board chairman ak mittal shocks andhra bjp parliamentarins after greeted him in vishaks, who came to Andhra Pradesh for three day visit.

రైల్వే బోర్డు చైర్మన్ ప్రశ్న విని.. ఎంపీలు షాక్.!

Posted: 05/13/2017 07:48 PM IST
Railway board chairman shock andhra bjp mps

రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ ఆంధ్రప్రదేశ్ బీజేపి ఎంపీలకు షాకిచ్చారు. అధికారిక పర్యటనలో భాగంగా ఆయన విశాఖ వచ్చిన సందర్భంగా.. ఆయనకు స్వాగతం పలికి.. పలు రైల్వే సమస్యలపై చర్చించాలని వచ్చిన విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులకు ఊహించని ప్రశ్నతో కొలుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత కొన్నేళ్లుగా ఎంతో ఉత్కంగా ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోను విషయమై పార్లమెంటు సభ్యులు మిట్టల్ ను  కలుసుకున్న సందర్భంగా అంశాన్ని లేవనెత్తారు.

దానిపై స్పందించిన మిట్టల్ రైల్వేలు అన్ని వసతులు కల్పిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా రైల్వేజోన్ ఎందుకని ప్రశ్నించడంతో ఎంపీలు బిత్తరపోయారు. నిజానికి చెప్పాలంటే వారికి మౌనం తప్ప ఏం అడగాలో కూడా అర్థంకాని పరిస్థితి ఎదురైంది. అయితే స్వయంగా ప్రభుత్వంలో భాగమైన పార్లమెంటు సభ్యులతో తాను ఇలా మాట్లాడుతున్నానని తెలుసుకున్నారో ఏమె తెలియదు కానీ.. మిట్టల్ తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ అనేది రాజకీయ నిర్ణయమని, అది తమ చేతుల్లో లేదని ఎంపీలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల రెండు దశాబ్దాల కల అని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో ఇది కూడా ఒకటని తెలిపారు. విశాఖ-ఢిల్లీ మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాలు అనుకూలంగా లేవని, రైలు వేగం కూడా పెంచాలని హరిబాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాల్తేరు డివిజన్‌కు కేంద్రం రూ.690 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క పనీ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లకు సంబంధించి పలు సమస్యలను మిట్టల్ దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra bjp mps  haribabu  srinivasa rao  ak mittal  railway zone  

Other Articles