Brave Child Drags Petrified Dad Along Glass Skywalk వైరల్ వీడియో: తండ్రికి ధైర్యం చెప్పి లాక్కెళ్లిన బుడతడు

Brave child drags petrified dad along glass skywalk in hilarious video

Brave Child Drags Petrified Dad, Petrified Dad Glass Skywalk, dad son Skywalk Hilarious Video, petrified dad, brave son, Skywalk, China, facebook, Hilarious Video, Viral video

A video posted on the Trending in China Facebook page shows a little three-year-old dragging his dad across a skywalk in China.

ITEMVIDEOS: వైరల్ వీడియో: తండ్రికి ధైర్యం చెప్పి లాక్కెళ్లిన బుడతడు

Posted: 05/13/2017 06:58 PM IST
Brave child drags petrified dad along glass skywalk in hilarious video

కొందరు ఎంత ఎదిగినా.. కొన్న చిన్న చిన్న విషయాలకు మాత్రం జంకుతారు. ఉదహారణకు ఇంట్లో బల్లులను చూసినా, బొద్దింకలను చూసినా ఎగిరి గంతేసే వారు లేకపోలేదు. అయితే కొందరు మాత్రం వయస్సులో ఎంత చిన్నవారైనా.. ఇంకా చెప్పాలంటే బుడతలైనా.. ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తారు. అంతేకాదు ఏకంగా పెద్దలకు కూడా ఏమీ కాదని ధైర్యాన్ని నూరిపోస్తారు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఈ బుడతడికి ఎదురైంది. మరీ అతగాడేం చేశాడో తెలుసుకునేందుకు ముందు ఈ బుడతడికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతుంది.

చైనాలోని ఎతైన శిఖరాగ్రాలపై గాజు వంతెనలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇవి పర్యాటకులను ఎంతగానో అకట్టుకుంటున్నాయి. అయితే ఈ గాజు వంతెనలపై నడవటం అంటే కొంద‌రికి సర‌దా.. మ‌రి కొంద‌రికి చ‌చ్చేంత భ‌యం. ఇలానే తండ్రితో పాటు గాజు వంతనపైకి పర్యటనకు వెళ్లిన ఆరేళ్లు కూడా నిండ‌ని బుడతడికి ఎదురైన వింత అనుభవం.. నెట్ లో హల్ చల్ చేస్తుంది. వాన్‌షెన్‌ నేషనల్‌ పార్కు (చైనా) లో గాజు వంతెనపైకి వెళ్లిన తండ్రి భ‌యంతో వ‌ణికిపోయాడు. గాజు వంతెనపై నడుస్తూ ఒక్కసారిగా కిందకి చూశాడు.. ఇక అంతే సంగ‌తి.. అత‌డి గుండెలు జారిపోయాయి.

ఇక ఆ వంతెనపై నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి విపరీతంగా భయపడి అక్కడే కూలబడిపోయాడు. అయితే, అత‌డి కుమారుడు మాత్రం గాజు వంతెన‌పై చ‌లాకీగా న‌డిచాడు. తండ్రికి ధైర్యం చెప్పాడు. చెయ్యి ప‌ట్టుకొని వంతెనపై లాక్కెళ్లాడు. ఈ వీడియోను చూస్తోన్న నెటిజ‌న్లంద‌రూ ఆ బాలుడికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ బాలుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఆ పార్కులో కొండ చుట్టూ 330 అడుగుల ఎత్తులో  213 అడుగుల పొడవుతో ఈ గాజు వంతెన ఉంటుంది. ఈ చిన్నారి త‌న తండ్రికి ధైర్యం చెబుతూ ఎలా లాక్కెళుతున్నాడో మీరూ చూడండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrified dad  brave son  Skywalk  China  facebook  Hilarious Video  Viral video  

Other Articles