beware of free LPG schemes and dealerships ఎల్పీజీ ఉచిత పథకం, డీలర్ షిఫ్ లపై అప్రమత్తం

Beware of free lpg schemes and dealerships on fake websites

oil ministry warns of fake websites, oil ministry warns of lpg dealership, oil ministry warns of lpg free schemes, Oil ministry, free LPG scheme, fake websites, lpg dealerships, distribution points, Pradhan Mantri Ujjwala Yojana, petroleum, Natural gas, LPG

The oil ministry warned citizens to be wary of fake websites on free-LPG scheme Pradhan Mantri Ujjwala Yojana saying they should not respond to advertisements for dealers being issued by such portals.

ఎల్పీజీ ఉచిత పథకం, డీలర్ షిఫ్ లపై అప్రమత్తం

Posted: 05/13/2017 02:53 PM IST
Beware of free lpg schemes and dealerships on fake websites

ప్రజలను దగా చేసేందుకు శ్రీశ్రీ చెప్పినట్లుగా ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా, దగా అను మాటలను అక్షరాల పాటిస్తూన్నారని, వారి నుంచి అప్రమత్తంగా వుండాలని కేంద్ర ఇంధనశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇంధన శాఖలోని అధికారిక ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో లింక్ అయి, రమారమి అలానే వుండేలా అనేక వెబ్ సైట్లు ఇప్పుడు నకిలీవి పుట్టుకోచ్చాయని.. వాటి నుంచి అప్రమత్తంగా వుండాలని ఇంధన శాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ వెబ్ సైట్లలో పొందుపర్చే సమాచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఉచిత ఎల్పీజీ స్కీమ్ పేరుతో వస్తున్న నకిలీ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉచితంగా ఎల్పీజీ పథకాలను అందిస్తామని, ఉచితంగా మరో సిలిండర్ ను బుక్ చేసుకునే వెసలుబాటును తాము అందిస్తున్నామని నకిలీ పోర్టల్స్ ప్రజలను మభ్య పెడుతున్నాయని అన్నారు. దీంతో పాటు ఎల్పీజీ డీలర్ షిప్ ప్రకటనల గుప్పిస్తూ ప్రజలను ప్రలోభాలకు గురయ్యేలా చర్యలు చేపడుతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా వుండాలని ఇంధనశాఖ అధికారులు హెచ్చరించారు.

కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తమ అధికారిక వెబ్ సైట్  www.pmujjwalayojana.com గా ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ అధికారిక వెబ్ సైట్ లో ఉచితంగా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఇంగ్లీష్, హిందీల్లో ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం ఈ దరఖాస్తులను నింపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఇదే అదనుగా చేసుకుని.. www.ujwalayojana.org వెబ్ సైట్లో ఆర్జీజీఎల్వీ యోజన కింద ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్ ను ప్రభుత్వం నియమించినట్టు ప్రకటన వస్తుందని, కానీ అలాంటివాటిని తాము అహ్వానించలేదని, ఇది అసలు అధికారి సంస్థ కాదని కూడా స్పష్టం చేసింది. దాని నుంచి వెలువడే ప్రకటనలతో తమకు సంబంధం లేదని తెలిపింది. ఫేక్ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oil ministry  free LPG scheme  fake websites  lpg dealerships  Natural gas  LPG  

Other Articles