Heavy Rain Cause Havoc in Hyderabad

Sudden rain hits hyderabad

Heavy Rain Hyderabad, Sudden Rain Hyderabad, Hailstorm Hyderabad, Hyderabad Power Cut, Hyderabad Rain Power, Hyderabad Heavy Rain, Havoc Rain, Unseasonable Hail and Thunder Showers, Hyderabad Unseasonable Rain, Sudden Rain Hyderabad, Hyderabad Heavy Rains, KTR Hyderabad Rains

Sudden Heavy Rains Disrupt life in Hyderabad. Hailstorm Continues Two More Days.

ITEMVIDEOS:40 నిమిషాల్లో నానా భీభత్సం

Posted: 05/10/2017 08:42 AM IST
Sudden rain hits hyderabad

భాగ్యనగర వాసులకు అకాల వర్షం చుక్కలు చూపించింది. క్యుములో నింబస్‌ మేఘాల కారణంగా మంగళవారం రాత్రి 11 గంటల నుంచి దాదాపు గంటపాటు ఈదురుగాలులు 40 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారేదాకా వర్షం కొనసాగగ, మరికొన్ని ప్రాంతాల్లో కనిష్ట వర్షపాతం నమోదైంది. అయితే మండుటెండల్లో ఒక్కసారిగా వర్షం పడటంతో నగరవాసులు ఉపశమనం పొందారు.

అక్కడ మాత్రం చెరువులే...

ఖైరతాబాద్‌, హిమాయత్‌ నగర్‌, నాగోలు, పంజాగుట్ట, మియాపూర్‌, మొయినాబాద్‌, కాప్రా, అల్వాల్‌, రామాంతపూర్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌, బోయినపల్లి, అమీర్‌ పేట, పంజాగుట్ట, కూకట్ పల్లి, బీకే గుడ, సనత్ నగర్, ఎర్రమంజిల్‌, తాజ్‌ కృష్ణ, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, మేడ్చల్‌ జిల్లాలోని కీసర, నాగారం, దమ్మాయిగూడ, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, కాప్రా, ఏఎస్‌ రావు నగర్‌, నేరేడ్‌ మెట్‌.. ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో... లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి.

 

విద్యుత్ అంతరాయం...

భారీ గాలితో కూడిన ఈ వర్షం ధాటికి సుమారు 30 చెట్లు కుప్పకూలాయి. పలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో హైదరాబాదులో అంధకారం అలముకుంది. దీంతో ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోపక్క మంత్రి కేటీఆర్ ట్విట్టర్ కు రాత్రంతా ఫిర్యాదులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మరో నెల రోజుల్లో వర్ష కాలం వస్తే పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందోనని ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.

నగరంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లో కూడా చెదురుమదురు జల్లులు కురిశాయని తెలుస్తోంది. నేడు కూడా భారీ స్థాయిలో గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Heavy Rain  Havoc  

Other Articles